GOVINDARAJA SWAMY TEMPLE ADHYAYANOTSAVAMS _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు

Tirupati, 03 February 2024: The Adhyayanotsavams which began on January 10 at Sri Govindaraja Swamy temple in Tirupati concluded on a grand note on Friday. 

 

Special programs were organized in the temple on this occasion.

 

The procession of utsava murthies of Sri Govindaraja Swamy, Sri Andal Ammavaru, Sri Vishwaksena, Sri Ramanujacharya, Sri Nammalwar, Sri Kurtalwar, Sri Thirumangaiyalwar started from the temple at 6 am.  After reaching Kapilatirtham through the streets of Tirupati, Thirumanjanam and Asthanam were performed there.  And later the deities returned to the temple.

 

Temple Deputy EO Smt Santi, AEO Sri Munikrishna Reddy, Superintendents Sri Narayana, Sri Mohan, Temple Inspectors Sri Radhakrishna, Sri Dhanunjaya participated in this program.

 
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు

ఫిబ్రవరి 02, తిరుపతి, 2024: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 10న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు ఆలయం నుంచి శ్రీ గోవిందరాజ స్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారు, శ్రీ విష్వ‌క్సేనుల‌వారు, శ్రీరామానుజాచార్యులు, శ్రీ న‌మ్మాళ్వార్‌, శ్రీ కూర‌త్తాళ్వార్‌, శ్రీ తిరుమంగైయాళ్వార్ ఉత్సవమూర్తుల ఊరేగింపు ప్రారంభ‌మైంది. తిరుప‌తి వీధుల గుండా కపిలతీర్థానికి చేరుకున్న అనంతరం అక్కడ తిరుమంజనం, ఆస్థానం నిర్వహించారు. అక్కడినుంచి బయల్దేరి పిఆర్‌ గార్డెన్‌ మీదుగా మధ్యాహ్నం తిరిగి ఆలయానికి చేరుకుంది.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ నారాయణ, శ్రీ మోహన్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ రాధాకృష్ణ, శ్రీ ధనుంజయ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.