GRAND ANKURARPANAM TODAY FOR PUSHPA YAGAM AT SRI KRT_ శ్రీ కోదండరామాలయంలో పుష్పయాగానికి ఘనంగా అంకురార్పణ

Tirupati 21 April 2018: Ankurarpanam was performed on Saturday evening for the unique Pushpa yagam festival of Sri Kodandarama Swamy Temple.

The customary Senapadhi utsavam was performed ahead of Ankurarpanam for the Pushpa yagam festival aimed cleansing the temple of any lapses in rituals by the staff, devotees or priests during last Brahmotsavam and for Lok Kalyan (well being of world) and peace.

On Sunday, Snapana Thirumanjanam in morning, Pushpayagam in the afternoon will commerce wherein abhisekham will be performed for the utsava idols of Lord Kodandarama, Seetha and lakshmana with huge number of flowers. In the evening the utsava idols of Sri Kodandarama swamy along with Sita, Lakshmana will be paraded on the mada streets of Sri KRT. Couples keen on participating in Pushpa yagam could do so with purchase of Rs.500 ticket.

Legends say that with performance of this Yagam after the annual Brahmotsavam will avert all ill effects if any.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

శ్రీ కోదండరామాలయంలో పుష్పయాగానికి ఘనంగా అంకురార్పణ

ఏప్రిల్‌ 21, తిరుపతి 2018: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 22వ తేదీ ఆదివారం నిర్వహించనున్న పుష్పయాగానికి శనివారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జరుగనుంది.

ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు సేనాధిపతి ఉత్సవం, సాయంత్రం 6.30 గంటలకు శాస్త్రోక్తంగా అంకురార్పణం చేపట్టనున్నారు.

ఆదివారం ఉదయం 10.30 గంటలకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చు.

శ్రీకోదండరామాలయంలో మార్చి 16 నుండి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మూెత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.