GRAND CELERBATION OF 128th JAYANTHI OF SADHU SUBRAMNAYAM SHASTRI_ ఘనంగా శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 128వ జయంతి

Tirupati, 17 December 2017: The 128th Jayanti of Sri Sadhu Subramanyam Shastri who unravelled the glorious and hoary past of the Srivari Temple by translating the rock and copper inscriptions of Srivari Temple at Tirumala was grandly celerbated today.

Tirupati JEO Sri Pola Bhaskar and other senior TTD officials offered floral tributes and garlanded the bronze statue of Sri Sadhu Subramanyam Shastri in front of the SVETA bhavan.

Speaking on the ocassion Sri Bhaskar said that Sriman Sadhu Subramanyam Sahastri who worked as an Peskar at Srivari Temple had not only translated the inscriptions at the temple but also successfully unravelled Annamayya sankeertans from 167copper places of the saint poet.

The JEO also presented Srivari Prasadam to Sadhu’s daughter Smt Girija Devi and also grand son Sri C S Murthy,principal civil judge at Kadapa on the ocassion .

TTD SVETA Director Smt Chenchu Lakshmi, HDPP Secretary Sri Ramakrishna Reddy, Superintendent Sri Muni Kumar and other officials participated in the event.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఘనంగా శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 128వ జయంతి

తిరుపతి, 2017 డిసెంబరు 17: తిరుమలలోని శాసనాలను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన శ్రీమాన్‌ సాధు సుబ్రమణ్యశాస్త్రి 128వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు.

తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల శ్రీసుబ్రమణ్యశాస్త్రి కాంస్య విగ్రహానికి టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్, ఇతర అధికారులు పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీమాన్‌ సాధు సుబ్రమణ్యశాస్త్రి శ్రీవారి ఆలయ పేష్కార్‌గా ఉంటూ ఎపిగ్రఫిస్టుగా రాగిరేకుల శాసనాలను సేకరించి అనువదించినట్టు తెలిపారు. అన్నమయ్య కీర్తనల భాండాగారం నుంచి 1167 రాగి రేకులను వెలికితీసి కీర్తనలను వెలుగులోకి తెచ్చారని వివరించారు.

ఈ సందర్భంగా శ్రీమాన్‌ సాధు సుబ్రమణ్యశాస్త్రీ కుమార్తె శ్రీమతి గిరిజాదేవి, మనవడు, కడప ప్రిన్సిపల్ సివిల్ జడ్జి శ్రీ సిఎన్.మూర్తిని జెఈవో సన్మానించి శ్రీవారి ప్రసాదాలను అందించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్వేత సంచాలకులు శ్రీమతి చెంచులక్ష్మీ, హెచ్ డిపిపి కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ మునికుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.