TTD SUPERANNUATED EMPLOYEES FELICITATED_ టిటిడి విశ్రాంత ఉద్యోగులకు ఘనంగా సన్మానం
Tirupati, 17 December 2017: On the occasion of the State retired employees day celebrations today, 123 TTD retired employees who had completed 75 years were grandly felicitated at the Annamacharya Kalamandir here.
At the event organized by the TTD, retired employees welfare association the veterans were honored with shawls, mementos and Srivari Prasadams.
Prominent of them were DyEO (first grade) Sri Krishnaswamy, Dr DM Premavati, Dr Venugopala Reddy.
Sri Reddywai Prabhakar Reddy, president of the Association, APRO Kumari P.Neelima and Sri Chinnamgari Ramana( Retd.Dy EO) and a host of retired TTD officials participated in the event.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడి విశ్రాంత ఉద్యోగులకు ఘనంగా సన్మానం
తిరుపతి, 2017 డిసెంబరు 17: రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 123 మంది టిటిడి విశ్రాంత ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. టిటిడి విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది.
సన్మాన గ్రహీతల్లో ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ కృష్ణస్వామి, మొదటి మహిళా డెప్యూటీ ఈవో శ్రీమతి పురాణం సావిత్రి, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి డా|| డిఎం.ప్రేమావతి, వైద్య విభాగానికి వన్నె తెచ్చిన డా|| వేణుగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఉన్నతాధికారుల స్థాయి నుంచి కింది స్థాయి సెక్యూరిటీ గార్డుల వరకు అందరినీ ఈ సందర్భంగా జ్ఞాపిక, శాలువ, శ్రీవారి ప్రసాదంతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ రెడ్డివారి ప్రభాకర్‌రెడ్డి, సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, రిటైర్డ్ డెప్యూటీ ఈవో శ్రీ చిన్నంగారి రమణ ఇతర విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.