GRAND CONCLUSION OF BALALYAM MAHASAMPROKSNAM SRI GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా ముగిసిన ;”బాలాలయ మహాసంప్రోక్షణ”

Tirupati, 15 December 2017: The hoary ritual of Balalayam concluded at the Sri Govindaraja Temple on Friday with the Purnahuti and other vaidka programs at the temple Yagasala.

Earlier TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, Tirupati JEO Sri Pola Bhaskar together performed special pujas at Balayalam. Speaking on the occasion Tirupati JEO said that devotees can have darshan of Sri Govindrajaswamy at Balayalam from afternoon 1PM onwards as the mula murthi darshan was stopped for rejuvenation works of the sanctum for the first time since 2004.

The members of the Ethics committee of TTD led by its chairman Dr. MVVS Murthy and members Sri Dwarapureddi Jagadeswar Rao, Sri G Srinivasulu, Sri Kolagantla Veerabhadraswami, Sri Rami Suryaravo also visited the temple and had darshan of the deity at the Balalayam.

The devotees had also a devotional feast this evening with the procession of Sri Govindarajaswamy on the pedashesha vahanam on the mada streets of temple in view of the Uttara nakshatram today .Among others Sri Sri Sri Pedda Jeeyangar Swami, Sri Sri Sri Chinna Jeeyangar Swamy, chief priest Sri Srinivasamurthi Dikshitulu, DyEO Smt P Varalakshmi, AEO Sri Prasadamurthy, Supdt Sri Suresh, Inspector Sri Prakash and others participated in the event.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా ముగిసిన ;”బాలాలయ మహాసంప్రోక్షణ”

డిసెంబరు 15, తిరుపతి, 2017;తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణ శుక్రవారం ఉదయం పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.

అంతకుముందు ఉదయం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ కలిసి బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తిరుపతి జెఈవో మాట్లాడుతూ ఆలయంలోని కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన బాలాలయంలో మధ్యాహ్నం 1.00 గంటల నుండి భక్తులను శ్రీ గోవిందరాజస్వామివారిని దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. స్వామివారి గర్భాలయంలో జీర్ణోద్ధరణ పనుల కారణంగా మూలమూర్తి దర్శనం ఉండదని, జీర్ణోదరణ తర్వాత మూలమూర్తి దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. అంతవరకు భక్తులు బాలాలయంలో స్వామివారిని దర్శించుకోవచ్చని వెల్లడించారు. ఆలయ జీర్ణోదరణలో భాగంగా శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం, గరుడాళ్వార్‌, ధ్వజస్తంభం, విమానగోపురం, ఎదురు ఆంజనేయస్వామివారి ఆలయం, తిరుమలనంబి, భాష్యకార్లు, ఆళ్వారుల ఆలయాలకు మరమ్మత్తులు చేయనున్నట్లు వివరించారు. ఇంతకుముందు 2004లో స్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ నిర్వహించినట్లు తెలిపారు.

శ్రీ గోవిందరాజస్వామివారి బాలాలయాన్ని దర్శించుకున్న ఎపి ఎథిక్స్‌ కమిటి

శ్రీ గోవిందరాజస్వామివారి బాలాలయాన్ని శుక్రవారం ఉదయం ఎపి ఎథిక్స్‌ కమిటి చైర్మన్‌ డా|| ఎమ్‌.వి.వి.ఎస్‌.మూర్తి, సభ్యులు శ్రీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, శ్రీ గౌనివారి శ్రీనివాసులు, శ్రీ కొలగంట్ల వీరభద్రస్వామి, శ్రీ రాము సూర్యారావులు దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు.

పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ గోవిందరాజస్వామివారు

ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామివారు శుక్రవారం సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.00 గంటల వరకు పెద్దశేషవాహనంపై ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌ స్వామి, ఆలయ ప్రధానార్చకులు శ్రీ శ్రీనివాసమూర్తి దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి పి.వరలక్ష్మి, ఏఈవో శ్రీ ప్రసాదమూర్తిరాజు, ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీ సురేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీప్రకాష్‌ ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.