GRAND CULMINATION OF HOMA MAHOTSAVAM AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా ముగిసిన హోమ మహోత్సవాలు
Tirupati, 23, November 2022: The Homa Mahotsavam at Sri Kapileswara temple organised by TTD during the Karthika Masam grandly concluded on Wednesday morning with the imposing Sri Chandikeswarar Swami Homa.
After divine kaikaryas begining with Maha Purnahuti to Ankurarpanam visarjana were observed
Later in the evening Laksha Deeparadhana and Aradhana was performed to Pancha murtis of Sri Vigneswara Swami, Sri Valli Devasena sameta Subramaniam Swamy, Sri Kapileswara Swamy, Sri Kamakshi Ammavaru and Sri Chandikeswara swami were grandly celebrated.
DyEO Sri Devendra Babu, AEO Sri Parthasarathy, Superintendent Sri Bhupathi and other officials and a large number of devotees were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా ముగిసిన హోమ మహోత్సవాలు
తిరుపతి, 2022 నవంబర్ 23: తిరుపతి, 2022 నవంబర్ 23: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నెల రోజుల పాటు నిర్వహించిన హోమ మహోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి.
ఉదయం శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరిగింది. అనంతరం మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం, త్రిశూలస్నానం, అంకురార్పణ విసర్జన నిర్వహించారు.
సాయంత్రం లక్షదీపారాధన, పంచమూర్తులైన శ్రీవిఘ్నేశ్వరస్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి, శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీచండికేశ్వరస్వామి వారికి ఆరాధన నిర్వహించారు. ఆ తరువాత పంచమూర్తులకు కొలువు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈఓ శ్రీ పార్థసారధి, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.