GRAND FLORAL TRIBUTES AT TARIGONDA VENGAMAMBA BRINDAVANAM _ తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఘనంగా పుష్పాంజలి
Tirumala, 16 Aug. 21: TTD officials organized grand floral tributes at the Brindavanam of Matrusri Tarigonda Vengamamba at Tirumala on Monday on the occasion of the 204 Vardanti celebrations of saint disciple of lord Venkateswara.
In recognition of her services and launch of Annaprasadam for pilgrims at Tirumala as well her sankeertans of Annamaiah Lali – Vengamamba Muthyala harathi are being performed till date during the ekantha Seva of Sri Venkateswara Swamy during the night.
TTD DyEO Sri Vijayasaradhi, Descendent of Vengamamba Sri Vishwamurti, Smt Nagamani, Superintendent of Tarigonda Vengamamba and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఘనంగా పుష్పాంజలి
తిరుమల, 2021 ఆగస్టు 16: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 204వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో సోమవారం టిటిడి అధికారులు ఘనంగా పుష్పాంజలి సమర్పించారు.
శ్రీవారి ఆపర భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తిరుమలలో మొదటగా అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. శ్రీవారికి ఏకాంతసేవ సమయంలో అన్నమయ్య లాలి – వెంగమాంబ ముత్యాలహారతి నేటికీ కొనసాగుతున్నాయి. వెంగమాంబ శ్రీవారిలో ఐక్యమైన రోజు కావడంతో ఇక్కడి బృందావనంలో పుష్పాంజలి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈఓ శ్రీ విజయసారథి, వెంగమాంబ వంశీయులు శ్రీ విశ్వమూర్తి, తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు సూపరింటెండెంట్ శ్రీమతి నాగమణి, సీనియర్ అసిస్టెంట్ శ్రీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.