ANDAL MALAS PROCESSION _ వైభవంగా ఆండాళ్ అమ్మవారి మాలల ఊరేగింపు
TIRUPATI, 15 FEBRUARY 2023: The Andal Sri Goda garlands from Sri Govindaraja Swamy reached Srinivasa Mangapuram in a procession on Wednesday.
The Goda Kalyana Yatra proceeded to Srinivasa Mangapuram via Gosala, Tatitopu, Perumallapalle. These garlands were decked to Mulavirat.
Both the Pontiffs of Tirumala, special Gr DyEO Smt Varalakshmi, DyEO Smt Shanti and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
వైభవంగా ఆండాళ్ అమ్మవారి మాలల ఊరేగింపు
తిరుపతి, 2023 ఫిబ్రవరి 15: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం రాత్రి 7 గంటలకు జరుగనున్న శ్రీవారి గరుడ సేవలో అలంకరించేందుకు ఉదయం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి ఆండాళ్ అమ్మవారి మాలలను ఊరేగింపుగా తీసుకెళ్లారు.
గోదా కల్యాణయాత్ర పేరిట నిర్వహించే ఈ యాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ యాత్ర శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఆలయం నుండి ఎస్వీ గోసంరక్షణశాల, తాటితోపు, పెరుమాళ్లపల్లి మీదుగా అంబారీపై మాలల ఊరేగింపు శ్రీనివాసమంగాపురానికి చేరుకుంది.
భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా అంబారీపై మాలలు ఆలయానికి చేరుకున్నది.
అనంతరం అర్చకులు శాస్రోక్తంగా ఆండాళ్ అమ్మవారి మాలలను శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్‌కు అలంకరించారు. అనంతరం రాత్రి జరిగే శ్రీవారి గరుడ సేవలో ఈ మాలలను స్వామివారికి
అలంకరించనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్ స్వామి, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవోలు శ్రీమతి వరలక్ష్మీ, శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయులు, ఇతర ఉన్నతాధికారులు, ఆధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 16న స్వర్ణ రథోత్సవం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజైన గురువారం స్వర్ణ రథోత్సవం వైభవంగా జరుగనుంది. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8 నుండి 9 గంటల వరకు గజవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.