GRAND SAHASRA KALASABHISHEKAM AT SRI KRT_ శ్రీ కోదండరామాలయంలో ఘనంగా సహస్ర కలశాభిషేకం

Tirupati, 18 December 2017: On the occasion of Amavasya Monday, the holy ritual of Sahasra Kalasabhisekham was performed at the Sri Kodandarama Swamy temple.

Later in the evening, the utsava deity of Sri Kodandarama Swamy will be taken out in procession on Hanumantha vahanam on the mada streets.

As per Vaikanasa Agama, the Pournami, Amavasya, Shukla Ekadasi, Krishna Ekadasi, Sravanam and Punarvasi stars are held sacred and rituals were performed in all Vaishnava temples.

Among others, the TTD local temples DyEO Smt Jhansi Rani, Supdt Sri Munikrishna Reddy, Temple inspectors Sesha Reddy and Sri Muralikrishna and temple priest and others participated in the event.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కోదండరామాలయంలో ఘనంగా సహస్ర కలశాభిషేకం

తిరుపతి, 2017 డిసెంబరు 18: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సోమవారం అమావాస్యను పురస్కరించుకుని ఉదయం 6.30 నుండి 8.00 గంటల వరకు సహస్ర కలశాభిషేకం వైభవంగా జరిగింది.

కాగా రాత్రి 7.00 నుంచి 9.00 గంటల వరకు హనుమంత వాహనసేవ వేడుకగా జరుగనుంది. సర్వాలంకార భూషితులైన శ్రీ కోదండరామస్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన హనుమంత వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రాలకు చాలా విశిష్టత ఉంటుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి సూపరిండెంట్‌ శ్రీమునికృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శేషారెడ్డి, శ్రీ మురళికృష్ణ, ఆలయ అర్చకులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.