TEPPOTSAVAMS AT SRI KAPILESWARA SWAMY TEMPLE FROM DEC 28 TO JAN 1, 2018_ డిసెంబరు 28 నుండి జనవరి 1వ తేదీ వరకు శ్రీకపిలేశ్వరాలయంలో తెప్పోత్సవాలు

Tirupati, 18 December 2017: The five dray glittering ritual of Teppotsavam will be performed at the Sri Kapileswara temple from Dec 28-January 1,2018. On all the five days all the deities of the Sri Kapileswara Swamy Temple complex will be taken out in a procession in the temple pushkarini.

January 2nd as part of the Arudra Darshan Mahotsavam the idols of Sri Nataraja Swamy, Sri Shivagami, Sri Manikya Vanaga will be taken out in procession .

As part of the Teppotsavams, the artists of TTD Annamacharya Project will perform bhakti sangeet etc every day and entertain the devotees.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డిసెంబరు 28 నుండి జనవరి 1వ తేదీ వరకు శ్రీకపిలేశ్వరాలయంలో తెప్పోత్సవాలు

తిరుపతి, 2017 డిసెంబరు 18: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 28 నుండి 2018 జనవరి 1వ తేదీ వరకు తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఐదు రోజులపాటు జరిగే తెప్పోత్సవాలలో మొదటిరోజైన డిసెంబరు 28వ తేదీన శ్రీ వినాయక స్వామివారు పుష్కరిణిలో ఐదు చుట్లు విహరిస్తారు. రెండవ రోజు శ్రీ సుబ్రమణ్యస్వామివారు ఐదు చుట్లు, మూడవ రోజు శ్రీ సోమస్కందస్వామివారు ఐదు చుట్లు, నాలుగో రోజు శ్రీ కామాక్షి అమ్మవారు ఏడు చుట్లు, ఐదో రోజు శ్రీచండికేశ్వరస్వామివారు, శ్రీ చంద్రశేఖర స్వామివారు తెప్పలపై తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.

జనవరి 2వ తేదీన ఆరుద్ర దర్శన మహోత్సవం సందర్భంగా ఉదయం 5.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారు, శ్రీ శివగామి అమ్మవారు, శ్రీ మాణిక్యవాసగ స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధులలో ఊరేగించనున్నారు. తెప్పోత్సవాల సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంకీర్తనలు ఆలపిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.