GRAND SRI RAMANAVAMI ASTHANAM AT SRI KRT _ శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా శ్రీరామనవమి ఆస్థానం

Tirupati, 21 Apr. 21: Sri Ramanavami Asthanam was performed at Sri Kodandaramaswamy temple on Wednesday in Ekantham as per Covid guidelines.

As part of the celebrations, Abhishekam is done to Mula Virat and utsava idols in the morning and later in the evening Sri Rama Janana pravachanam and Asthana were recited. Later Hanumanta Vahana Seva held.

Tirumala Chinna Jiyar Swamy, Special Grade DyEO Smt Parvati, AEO Sri Durga Raju, Superintendent Sri Ramesh, Inspector Sri Jayakumar and others were present.

SRI SITA RAMA KALYANAM ON APRIL 22

As part of Sri Ramanavami festivities the TTD is organising Sri Sita Rama Kalyanam followed by a procession of utsava deities inside temple as per Covid guidelines.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా శ్రీరామనవమి ఆస్థానం

తిరుపతి, 2021 ఏప్రిల్ 21: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధ‌వారం శ్రీరామనవమి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఉదయం 3 నుండి 4 గంటల వరకు మూలవర్లకు, శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు అభిషేకం చేశారు.

సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీరామ జనన ప్రవచనం, ఆస్థానం నిర్వహించారు. ఆల‌యంలో రాత్రి 7 గంటలకు శ్రీరామచంద్రమూర్తి తన ప్రియభక్తుడైన హనుమంత వాహనంపై వేంచేపు చేస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్‌‌స్వామి ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వ‌తి, ఏఈవో శ్రీ దుర్గ‌రాజు, సూపరింటెండెంట్‌ శ్రీ ర‌మేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్
శ్రీ జ‌య‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఏప్రిల్‌ 22న శ్రీ సీతారాముల కల్యాణం :

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 22వ తేదీ గురువారం సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం ఏకాంతంగా జరుగనుంది. ఆనంత‌రం శ్రీ సీతాల‌క్ష‌ణ స‌మేత
శ్రీ కోదండ‌రామ‌స్వామివారు ఆల‌యంలోనే ఊరేగుతారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.