SNAPANAM HELD TO SRI RAMA _ శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి ఆస్థానం

Tirumala, 21 Apr. 21: Snapana Tirumanjanam has been performed to utsava idols of Sri Rama, Sita and Lakshmana Swamy as part of Sri Rama Navami festivities in Tirumala temple on Wednesday.

The utsavarulu were seated on a separate platform at Ranganayakula Mandapam. After Sankalpam, Snapana Tirumanjanam commenced amidst chanting of Veda Mantras.

HE Governor of Tamilnadu Sri Bhanwarilal Purohit also participated in this special abhishekam performed to the deities.

HH Tirumala Pedda Jiyar Swamy, EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Harindranath and others were also present.

HANUMANTHA VAHANA SEVA

 Later in the evening, the utsava idol of Sri Rama will be taken on a procession along four mada streets on Hanumantha Vahanam between 7pm and 9pm. In connection with this Vahanam, TTD has cancelled Sahasra Deepalankara Seva.

SRI RAMA NAVAMI ASTHANAM HELD

In the night, Sri Rama Navami Asthanam will be held at Bangaru Vakili between 10pm and 11pm.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి ఆస్థానం

తిరుమల, 21 ఏప్రిల్‌ 2021: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధ‌వారంనాడు శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని శ్రీసీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ గౌ. శ్రీ భ‌న్వారిలాల్ పురోహిత్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.‌

ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.  ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీరామనవమి ఆస్థానం

శ్రీరామనవమి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు హ‌నుమంత వాహ‌నసేవ జ‌రుగ‌నుంది. ఆ త‌రువాత రాత్రి  10 నుండి 11 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.