GRAND TEPPOTSAVAM AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ ఘనంగా శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు

Tirupati, 28,December 2017: The five day Teppotsavam commenced at the Sri Kapileswara swamy temple this evening. Floats laiden with flower decked and bejeweled Utsava Idols and glittering electrical lighting would go for five rounds at the pushkarni on Day-1.

On Friday (Day-2) the utsava idol of Subramanya Swamy would be taken around the float for five rounds. The artists of the TTD annamacharya project will present cultural programs like bhakti sangeet and sankeertans on the ocassion.

Tirupati JEO Sri Pola Bhaskar, Temple DyEO Sri Subramanyam, AEO Sri Shankar Raju and other officials participated in the program.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఘనంగా శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు

తిరుపతి, 28 డిసెంబరు 2017; తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఐదు రోజులపాటు జరుగనున్న తెప్పోత్సవాలు గురువారం సాయంత్రం ఘనంగా ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు కపిలతీర్థంలో తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.

విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై మొదటిరోజు శ్రీవినాయకస్వామివారు ఐదు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తారు. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించనున్నారు.
అదేవిధంగా శుక్రవారం శ్రీ సుబ్రమణ్యస్వామివారు తెప్పలపై ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ శంకర్‌రాజు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.