SERVE DEVOTEES ON V-DAY WITH LOVE AND AFFECTION – EO TELLS SRIVARI SEVAKAS _ శ్రీవారి సేవకులు భక్తులకు ప్రేమతో సేవలందించాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 28 December 2017: The TTD Executive officer, Sri Anil Kumar Singhal called upon the Srivari Sevakulu,Scouts and Guides to serve the devotees with love and affection.

Addressing the Srivari Sevaks and Scouts & Guides who had come to render services for Vaikuntha Ekadasi, Dwadasi, the EO lauded them for their unstinted service during the recent Brahmotsavams and urged them to serve the devotees with same zeal and enthusiasm.

He said the devotees feed back on the Srivari Sevaks service has been excellent. Under the new system of slots for 2 days, 3 days, 4 days and 7 days, for Vaikuntha Ekadasi 3414 Srivari Sevaks had come to serve at Tirumala besides 1000 Scouts & Guides.

The EO appealed to them to behave smoothly with devoees in mainaining queue lines with patience. He said the new complex of Srivari Seva Sadan would come into operation and all srivari sevaks would be provided comforable accomodation and also training programs to serve the devotees satisafactorily.

TTD CVSO Sri Ake Ravi Krishna said that Srivari Sevaks should work at all wings and ensure that devotees are not put to any inconvenience. They should also assist the TTD vigilance and police in maintaining law and order. The CVSO inspired and enthralled by personally reciting the famous sankeertan’ Vedam bevvani Vedakedani’ of Annamacharya.

The TTD Eduation Officer Sri Ramachandra urged the Scouts to refer devotees as Govinda and render service.



ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి సేవకులు భక్తులకు ప్రేమతో సేవలందించాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

డిసెంబరు 28, తిరుమల 2017 ; తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ప్రేమతో శ్రీవారి సేవకులు సేవలందించాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ కోరారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా భక్తులకు సేవలందించేందుకు విచ్చేసిన శ్రీవారి సేవకులకు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు తిరుమలలోని ఆస్థానమండపంలో గురువారం అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిడి ఈవో మాట్లాడుతూ సెప్టెంబరులో జరిగిన శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో శ్రీవారి సేవకులు విశేషంగా సేవలందించారని, అదేస్ఫూర్తితో ప్రస్తుతం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు విచ్చేసిన భక్తులకు సేవలు అందించాలని కోరారు. శ్రీవారి సేవకుల సేవలపై అభిప్రాయాలు సేకరించగా భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ప్రస్తుతం 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 7 రోజులు ప్రాతిపదికన మొత్తం 3,414 మంది శ్రీవారి సేవకులు, వెయ్యి మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ భక్తులకు సేవలందించేందుకు వచ్చారని వివరించారు. క్యూలైన్ల నిర్వహణ విషయంలో భక్తులతో సున్నితంగా వ్యవహరించాలని, ఓపికతో సేవలందించాలని సూచించారు. టిటిడిలోని ఆయా విభాగాలపై సేవకులు పూర్తి అవగాహన పెంచుకుని తగిన విధంగా భక్తులకు సేవలందించాలన్నారు. త్వరలో నూతన శ్రీవారి సేవా సదన్‌ అందుబాటులోకి రానుందని, అక్కడ సేవకులకు బసతోపాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయా విభాగాల్లో సేవకులు సేవలందించాలన్నారు. భద్రతాపరంగా టిటిడి నిఘా, భద్రతా సిబ్బందికి, పోలీసులకు శ్రీవారి సేవకులు సహకరించాలని సూచించారు. ముందుగా ”వేదంబెవ్వని వెదకెడిని…” అనే అన్నమయ్య సంకీర్తనను సివిఎస్‌వో స్వయంగా ఆలపించి శ్రీవారి సేవకులు, స్కౌట్స్‌లో భక్తిభావం నింపారు.

టిటడి విద్యాశాఖాధికారి శ్రీ రామచంద్ర మాట్లాడుతూ ముక్కోటి దేవతల రూపంలో వచ్చిన భక్తులను గోవింద అని సంబోధించి భక్తితో సేవలందించాలని కోరారు.

ముందుగా శ్రీ సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులు భజన కార్యక్రమం నిర్వహించారు. శ్రీవారి సేవకులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ఉత్సాహంగా భజనలో పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, శ్రీవారి సేవ ఏఈవో శ్రీ గోపాలరావు, శ్రీ సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.