GRANDEUR MARKS DHWAJAROHANAM IN TIRUCHANOOR TEMPLE_ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభం

Tiruchanoor, 4 December 2018: The nine day Karthika Brahmotsavams of Sri Padmavati who resides in Tiruchanoor as Sarva Swatantra Veera Lakshmi off to a grand start with the Dwajarohanam on Tuesaday at 8.30am in the auspicious Vrischika Lagnam amidst chanting of Vedic mantras under the able supervision of TTD Pancha Rathra agama advisor and Kankana Bhattar Sri Srinivasacharyulu.

GAJA PATAM INSTALLATION

After awakening the Goddess with Suprabatha seva the special rituals for the day started. The sacred flag bearing the image of Gaja- the divine elephant was unfurled in the Yagashala. Later, Gaja Dhyana sloka, Gaja Mangalastakam and Garuda Gadyam were recited as mentioned in the Kashyapasamhita.

Purnahuti was performed as per Rakshabandhan, Chayadivasam, Chaya Snapanam, Netronmeelanam, Tatwanyasa Homam, Prana Pratista Homam and concluded with Purnahuti before the Gaja flag was brought to the mandapam.

Invite for all Gods

As part of ritual Viswaksena Aradhana, Punyahavachanams were performed. Nine Kalashas were filled with holy liquid to welcome Gods of all worlds who were grandly felicitated by chanting of four vedas. Raksha Bandhan was tied to Dwajastambha to ensure smooth conduct of the celestial event.

A unique Raga- tala- nivedana was performed to appease the deities with each raaga including Kalyani, Neelambari, Bhairavi, Mayamalavagowla, Kanada in different Talas.

Later the TTD Executive Officer Sri Anil Kumar Singhal said dwajarohanam was performed on the inaugural day of Brahmotsavam inviting all gods and goddessesto take part in this nine day mega festival of Universal Mother.

He said all arrangements were made to facilitate the devotees with Drinking water, toilets, Anna Prasadam and parking facilities. Efforts were made to provide Mula murti darshan to devotees along with Vahana Sevas on the same day. He urged the devotees to participate in large numbers and beget the blessings of Goddess Padmavati.

Among other prominent officials, Tirupati JEO Sri Pola Bhaskar, CVSO Sri Gopinath Jetti, Additional CVSO Sri Sivakumar Reddy, VGO Sri Ashok Kumar Goud, DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam other officials and devotees were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభం

తిరుపతి, 2018 డిసెంబరు 04: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి హృదయేశ్వరియైన తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు మంగ‌ళ‌వారం ధ్వజారోహణంతో అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు కన్నులపండుగగా జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా తొలిరోజు ఉదయం 8.50 గంటలకు వృశ్చిక‌ లగ్నంలో వేదమంత్రోచ్ఛారణ మధ్య ధ్వజారోహణం నిర్వహించారు. టిటిడి పాంచరాత్ర ఆగమ సలహాదారు మ‌రియుప్రధాన కంకణభట్టార్‌ శ్రీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

గజపట ప్రతిష్ఠ :

ఆలయంలో ఉదయం అమ్మవారికి సుప్రభాతం నిర్వహించారు. ఇదే సమయంలో యాగశాలలో గజపట ప్రతిష్ఠ చేపట్టారు. గజ ప్రతిష్ఠలో భాగంగా గజధ్యాన శ్లోకం, గజ మంగళాష్టకం, గరుడ గద్యం వళ్లించి అపరాధ క్షమాపణం కోరారు. ఈ గరుడ గద్యం ప్రస్తావన కాశ్యప సంహితలో ఉంది. ఈ సందర్భంగా రక్షాబంధనం, ఛాయాధివాసం, ఛాయా స్నపనం, నేత్రోల్మీనలనం, తత్వన్యాస హోమం, ప్రాణప్రతిష్ట హోమం, పూర్ణాహుతి చేపట్టారు. ఆ తరువాత గజపటాన్ని ధ్వజారోహణ మంటపానికి తీసుకొచ్చారు.

సకలదేవతలకు ఆహ్వానం:

ధ్వజారోహణ ఘట్టంలో మొదటగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం నిర్వహించారు. నెయ్యి, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచగవ్యం, పాలు, పెరుగు, తేనె, పసుపునీటిని తొమ్మిది కలశాల్లో ఉంచి పరవాసుదేవ, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర దేవతలను ఆవాహన చేశారు. ఆ తరువాత షోడషోపచారాలు నిర్వహించారు. చతుర్వేదాలను పారాయణం చేశారు. ధ్వజస్తంభానికి అభిషేకం తరువాత బ్రహ్మూత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని దేవతలను ప్రార్థిస్తూ రక్షాబంధనం చేశారు.

రాగ, తాళ నివేదన :

రాగ స్వర తాళాలతో దేవతలను, పంచాయుధాలను, కుముదాది గణాలను ఆహ్వానించారు. కుబేరుడి కోసం శ్రీరాగం, పరమేశ్వరుడి కోసం శంకరాభరణం, గజరాజు కోసం మాళవగౌళ, బ్రహ్మ కోసం ఏకరంజని, వరుణుడి కోసం కానడ, వాయువు కోసం తక్కేసి రాగాలను మంగళవాయిద్యాలపై పలికించారు. అదేవిధంగా గాంధార రాగం, మురళీ రాగం, నాటభాగ రాగం, కల్యాణి రాగం – ఆదితాళం, భుజంగ రాగం – ధ్రువ తాళం, గరుడాఖ్యి రాగం, సావేరి రాగం – త్రిపుట తాళం, సుమంత రాగం – నాట తాళం, మధ్యమావతి రాగం – మధ్య తాళం, సౌరాష్ట్ర రాగం – రూపక తాళం, బేగడ రాగం – ఏక తాళం, రేగుప్త రాగం – శంబే తాళం, పంతువరాళి రాగం – మల్ల తాళం, సామంత రాగం, రామక్రియ రాగం – సింహళిక తాళం, కాంభోజి రాగం – సింహవిక్రమ తాళం, దేవగాంధార రాగం – శ్రీరంగ తాళం, కారీ రాగం – గజలీలా తాళం, వరాళి రాగం – చించత్పుర తాళం, అనంత తాళం, కౌషిక రాగం – ఘర్మ తాళం, ఘంటా రాగం – నృసింహ తాళం, భూపాల రాగం – సింహనాద తాళం ఆలపించారు. భూలోకం, సువర్ణ లోకం, పాతాళ లోకాల నుంచి దేవతలను ఆహ్వానించేందుకు గజపటం ఆరోహణం చేయడంతో ధ్వజారోహణ పర్వం ఘనంగా ముగిసింది.

అనంతరం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు సకలదేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం అంగరంగ వైభవంగా నిర్వహించినట్టు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదం, తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్‌ వసతులు కల్పించినట్టు తెలిపారు. బ్ర‌హోత్స‌వాల‌లో వాహనసేవలతో పాటు భ‌క్త‌లకు మూల‌మూర్తి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలిపారు. వాహనసేవలలో భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌ దంపతులు, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విజివో శ్రీ అశోక్ కుమార్‌గౌడ్‌, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.