GRANDHI SAMARPANA IN SRI KT_ ఘనంగా శ్రీ కపిలేశ్వరస్వామివారికి గ్రంధి పవిత్ర సమర్పణ

Tirupati, 25 Jul. 18: On the second day of annual Pavitrotsavams, Grandhi Samarpana was observed in Sri Kapila Teertham temple in Tirupati on Wednesday.

Earlier during the day, homam and other vedic rituals were carried out in the Yagashala of the temple.

Temple DyEO Sri Subrahmanyam and other staffs were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఘనంగా శ్రీ కపిలేశ్వరస్వామివారికి గ్రంధి పవిత్ర సమర్పణ

తిరుపతి, 2018 జూలై 25: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి గ్రంధి పవిత్ర సమర్పణ ఘనంగా జరిగింది. ఇందులోభాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు.

ఉదయం నిత్యహోమం, గ్రంధి పవిత్ర సమర్పణ, మూలవర్లకు విశేష ఉపచారాలు చేపట్టారు. సాయంత్రం పవిత్రోత్సవాల్లో భాగంగా యాగశాల పూజ, హోమం, లఘు పూర్ణాహుతి చేపడతారు. రూ.500/- చెల్లించి ఇద్దరు గృహస్తులు ఒక రోజు పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక లడ్డూ, ఉత్తరీయం, రవికె బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌, ఆలయ అర్చకులు శ్రీస్వామినాథస్వామి, శ్రీ మణిస్వామి, శ్రీ ఉదయస్వామి, టెంపుల్‌ ఇన్స్‌పెక్టర్లు శ్రీ నారాయణ, శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.