TIRUMALA TEMPLE DOORS TO BE CLOSED FROM 5PM OF JULY 27 TILL 4.15AM OF JULY 28_ చంద్ర గ్రహణం కారణంగా జూలై 27న సా|| 5.00 నుండి మరునాడు ఉ|| 4.15 గం||ల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూత

CHANDRA GRAHANAM ON JULY 27
NO ANNAPRASADAM ON JULY 27 AFTER 5PM

Tirumala, 25 Jul. 18: The temple doors of hill shrine of Sri Venkateswara Swamy remains closed for almost 12 hours owing to lunar eclipse on July 27.

As the occurrence of total lunar eclipse is evident between 11.54pm of July till 3.49am of July 28, as per the temple tradition, the main doors will be closed six hours prior to eclipse by 5pm on July 27.

Again the temple doors will be opened at 4.15am with Suprabhata Seva followed by Suddhi and Punyahavachanam. Later remaining pre-dawn Arjitha sevas are observed.

Meanwhile, the distribution and serving of Annaprasadam to pilgrims in compartments and Annaprasadam Complex also closes by 5pm on July 27. About 20000 food packets will be distributed to Pilgrims at Nada Neeraajanam platform, food courts between 3pm and 5pm. The food distribution will resume only after 9am on July 28.

The devotees are requested to make note of the changes and co-operate with TTD.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

చంద్ర గ్రహణం కారణంగా జూలై 27న సా|| 5.00 నుండి మరునాడు ఉ|| 4.15 గం||ల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూత

జూలై 25, తిరుమల 2018: చంద్రగ్రహణం కారణంగా జూలై 27వ తేదీ సాయంత్రం 5.00 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 4.15 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం మూసివేయనున్నారు.

జూలై 27వ తేదీ శుక్రవారం రాత్రి 11.54 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై జూలై 28న శనివారం ఉదయం 3.49 గంటలకు పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. జూలై 28న

ఉదయం 4.15 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా ఉదయం 7.00 గంటలకు సర్వదర్శనం ప్రారంభవుతుంది.

జూలై 27న ఆర్జితసేవలు రద్దు –

చంద్రగ్రహణం కారణంగా జూలై 27వ తేదీ శుక్రవారం కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెతవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

జూలై 27న పౌర్ణమి గరుడుసేవ రద్దు :

ఈ నెల 27వ తేది శుక్రవారం నిర్వహించవలసిన పౌర్ణమి గరుడసేవను చంద్రగ్రహణం కారణంగా టిటిడి రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.

జూలై 27న తిరుమలలో అన్నప్రసాద వితరణ కేంద్రాలు మూత :

చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 27వ తేదీ శుక్రవారం సాయంత్రం 5.00 గంటల నుండి తిరుమలలో అన్నప్రసాదాల వితరణ వుండదు. తిరిగి మరల జూలై 28వ తేదీ శనివారం ఉదయం 9.00 గంటలకు అన్నప్రసాదాల పంపీణి పున: ప్రారంభమవుతుంది.

ఈ సందర్భంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పిఏసి-2, విక్యూసి-2, టిటిడి ఉద్యోగుల క్యాంటీన్‌, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం, ఎస్వీ విశ్రాంతి భవనాలలో అన్నప్రసాదాల వితరణ ఉండదు.

భక్తుల సౌకర్యార్థం ముదస్తుగా టిటిడి అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో 20 వేల పులిహోర, టమోట అన్నం ప్యాకెట్లను సాయంత్రం 3.00 నుండి 5.00 గంటల వరకు పంపీణి చేయనున్నారు. ఇందులో భాగంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ 1 మరియు 2, నాదనీరాజనం వేదిక ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాదం ప్యాకెట్లను అందిస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.