శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయంలో ఘనంగా పెద్దవీధి ఉట్లోత్సవం
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయంలో ఘనంగా పెద్దవీధి ఉట్లోత్సవం
తిరుపతి, 2019 ఆగస్టు 27: శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయంలో మంగళవారం పెద్దవీధి ఉట్లోత్సవము వేడుకగా నిర్వహించారు.
ఇందులో బాగంగా ఉదయం స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, నిత్య కైంకర్యాలు జరిపి, సాయంత్రం 4.00 గంటలకు శ్రీగోవిందరాజస్వామి వారిని బంగారు తిరుచ్చిపై మరియు శ్రీకృష్ణస్వామి వారిని పల్లకిలో విశేషంగా అలంకరించి, పెద్దవీధి ఉట్లోత్సవము (సన్నిధి వీధి, కర్ణాలవీధి, బేరి వీధి, నాధముని వీధి, గాంధీ రోడ్డు, సన్నిధి వీధి) సాయంత్రం 4.00 గంటల నుంచి 6.30 గంటల వరకు నిర్వహించారు. ఈ ఉట్లోత్సవములో భాగంగా స్వామి వారు కైకాలరెడ్డి ఫ్యామిలీ, బుగ్గ మఠం, నాలుగు కాళ్ల మండపం ఇంకా 08 మంది ఉభయదారుల ఉప ఆలయాలలో/ ఇళ్ళళ్ళో/ మఠాలలోకి వేంచేయడం జరిగింది. అక్కడ శ్రీగోవిందరాజ స్వామివారికి మరియు శ్రీకృష్ణస్వామి వారికి నివేదన, ఆస్థానం నిర్వహించారు.
ఆయా కార్యక్రమాలలో శ్రీ పెద్దజియ్యంగార్ స్వామి, శ్రీ చిన్నజియ్యంగార్ స్వామి ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటి ఈఓ శ్రీమతి వరలక్ష్మి, ఎఇఓ శ్రీ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ జ్ఞాన ప్రకాష్, టెంపుల్ ఇన్ స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.