భక్తుల కానుకలకు పూర్తి భద్రత ఖజానా విభాగంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు: టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 27 Aug. 19: TTD Executive officer Sri Anil Kumar Singhal said all precautions and vigilant steps were taken by TTD in the preservation of devotees contributions of Gold and silver ornaments and others with proper documentation in the treasury.

Speaking to reporters at the TTD administrative building on Tuesday evening the EO denied reports of laxity and carelessness in preserving the devotees’ contributions and said stringent actions were taken against such erring officials if any.

He said all the devotee’s contributions were safely and systematically brought to the treasury of TTD administrative building where an AEO rank official recorded them and kept the ornaments in lockers. In the event of a transfer of the officials, there would be a total inspection of all items in the presence of outgoing, and incoming officials in the presence of Vigilance, concerned DyEO and accounts officials.

The AEO Sri M Srinivasulu had personally reported of some shortages of ornaments worth totalling of ₹7,36,375 as per certification of October 10, 2017, and also some additions.

He said among the excess items were some gold silver ornaments, precious stones, gold plated jewels.

The EO said after investigations the then AEO Sri Srinivasulu was held responsible for the shortfall in ornaments cited above and at the rate of ₹25,000 per month, an amount of ₹2.25 lakhs have so far been recovered from him.

He said on the appeal of the said AEO the TTD has agreed to undertake certification once again in September next and where the truth about shortages could become more transparent.

The EO said in the event if the alleged shortlisted items were not found, the TTD would take action for the full recovery of the total amount cited above and also initiate Departmental disciplinary proceedings as well on the Concerned AEO Srinivasulu. The items said to be in excess would be listed added to the registry of the treasury.

Additional FACAO Sri Ravi Prasad, Treasury and inventory DyEO Sri Devendrababu were present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తుల కానుకలకు పూర్తి భద్రత ఖజానా విభాగంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు: టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2019 ఆగస్టు 27: టిటిడి ఆలయాల్లో హుండీల ద్వారా భక్తులు సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలు, ఇతర కానుకలను రికార్డుల్లో పక్కాగా నమోదు చేసి ఖజానాలో భద్రపరుస్తున్నామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులు సమర్పించిన కానుకల విషయంలో అలసత్వం వహిస్తున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. ఖజానా విభాగంలో విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన తీసుకుంటామని తెలిపారు. టిటిడి ఆలయాల్లో భక్తులు హుండీల్లో సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలు ఇతర కానుకలను తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల ఖజానాకు తరలించి భద్రపరుస్తామన్నారు. ఇక్కడ ఏఈవో ఆధ్వర్యంలో వీటిని రికార్డుల్లో నమోదు చేసుకుని లాకరులో భద్రపరుస్తామని వివరించారు. సంబంధిత అధికారి బదిలీ అయిన సందర్భంలో బదిలీ అయిన ఏఈవో, కొత్తగా బాధ్యతలు స్వీకరించే ఏఈవో, ఖజానా డెప్యూటీ ఈవో, అకౌంట్స్‌ అధికారులు, విజిలెన్స్‌ అధికారుల సమక్షంలో వస్తువుల పరిశీలన జరుగుతుందన్నారు. ఈ క్రమంలో ఖజానాలో 2017, అక్టోబరు 10 నాటికి చేపట్టిన వెరిఫికేషన్‌లో కొన్ని వస్తువులు కొరత(షార్టేజి) ఉన్నట్టు, మరికొన్ని వస్తువులు అదనంగా ఉన్నట్టు సదరు ఏఈవో శ్రీ ఎం.శ్రీనివాసులు స్వయంగా నివేదించారని తెలిపారు.

కొరత ఉన్న వస్తువుల్లో 1) రూ.4,18,469/- విలువైన సాధారణ రాళ్లతో కూడిన రెండు బంగారు ఉంగరాలు, సాధారణ రాళ్లతో కూడిన రెండు నెక్లెస్‌లు, 2)రూ.71,259/- విలువైన ఒక బంగారు నాణెం, 3) రూ.2,32,200/-విలువైన ఒక వెండి కిరీటం, 4) రూ.14,274/- విలువైన వెండి పూత పూసిన రాగి నాణేలు, 5) రూ.174/- విలువైన అల్యూమినియం నాణెం ఉన్నాయని ఈవో తెలిపారు. వీటి మొత్తం విలువ రూ.7,36,376/- అని వెల్లడించారు.

అదనంగా ఉన్న వస్తువుల్లో 11.778 కిలోల వెండి వస్తువులు, 2.608 కిలోల ముత్యాలు, 369 గ్రాముల పగడాలు, 936 గ్రాముల విడి రాళ్లు, 31 గ్రాముల బంగారు ఆభరణాల విడిభాగాలు, 250 గ్రాముల బంగారు పూత పూసిన వెండి, 800 గ్రాముల వెండి, 16.700 గ్రాముల వెండి వస్తువులు, 2.350 గ్రాముల ఆవగింజ సైజుగల వజ్రం, 2 పచ్చరాళ్లు కలిగిన బంగారు ఉంగరం ఉన్నాయని ఈవో వివరించారు.

అప్పట్లో ఏఈవోగా విధుల్లో ఉన్న శ్రీ ఎం.శ్రీనివాసులును కొరత వచ్చిన వస్తువులకు నిబంధనల మేరకు బాధ్యులుగా గుర్తించామని ఈవో తెలిపారు. ఈ మేరకు ఆయన జీతం నుండి నెలకు రూ.25 వేలు చొప్పున ఇప్పటివరకు రూ.2.25 లక్షలు తిరిగి వసూలు చేశామన్నారు. మరోసారి ఖజానాలోని వస్తువులను పరిశీలించాలని సదరు ఏఈవో విన్నవించారని, ఇందుకు అంగీకరించామని తెలిపారు. ఇందులో భాగంగా సెప్టెంబరులో వెరిఫికేషన్‌ను అనుమతి ఇచ్చామని, ఇందులో వాస్తవాలు వెలుగుచూసే అవకాశముందని వెల్లడించారు. ఒకవేళ కొరత గల వస్తువులు లేవని తేలితే పూర్తి సొమ్ము రికవరీతోపాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అదనంగా ఉన్న వస్తువులను టిటిడి ఖజానాకు జమ చేస్తామన్నారు.

ఈ మీడియా సమావేశంలో టిటిడి అదనపు ఎఫ్‌ఏ, సిఏవో శ్రీ రవిప్రసాదు, ట్రెజరీ అండ్‌ ఇన్వెంటరీ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.