HAMASA VAHANA SEVA IN KT _ హంస వాహనంపై శ్రీ సోమస్కంధముర్తి

Tirupati, 4 Mar. 21: The annual brahmotsava vahana Seva kick-started in Sri Kapileswara Swamy temple with Hamasa Vahana Seva on Thursday evening.

The processional deities of Sri Kapileswara Swamy along with Kamakshi Ammavaru seated on beautifully decorated Hamsa Vahanam.

The deities blessed the devotees on Hamsa Vahana which was held in Ekantam.

DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupathi Raju and others were also present. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

హంస వాహనంపై శ్రీ సోమస్కంధముర్తి

తిరుపతి, 2021 మార్చి 04: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో మొద‌టి రోజు గురువారం రాత్రి హంస వాహ‌నంపై శ్రీ సోమస్కంధముర్తికి, పల్లకీలో శ్రీ కామాక్షి అమ్మ‌వారికి ఆస్థానం నిర్వ‌హించారు. రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఆది దంపతులైన స్వామి, అమ్మవార్లు హంస మిథునం(దంపతులు)లా గోచరిస్తారు. వారి వల్లనే అష్టాదశ విద్యలు పరిణమించాయి. పాలను, నీటిని వేరు చేసే వివేకం అలవడింది. కపిలాది యోగీశ్వరుల మానస సరస్సులో హంస జంటగా స్వామి, అమ్మవారు అనుగ్ర‌హిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.