HAMSA VAHANAM MUSES DEVOTEES_ శ్రీ క‌ల్యాణ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో హంస వాహ‌నం

Srinivasa Mangapuram, 7 February 2018: On the second day evening, the Lord took a celestial ride on Hamsa Vahanam in Srinivasa Mangapuram as a part of the ongoing annual brahmotsavams.

Hamsa is believed to have the high intellectual capability to distinguish milk from water which is the nature of Parabrahma Swarupa. By taking ride on this vahanam, the Lord shows that by taking celestial ride on divine vehicle, the bad will be punished to protect the good.

DyEO Sri Venkataiah, AEO Sri Srinivasulu, DyEE Sri Ramamurthy, Chief Kankana bhattar Sri Balaji Rangacharyulu, AE Sri Nagaraja, AVSO Sri Ganga Raju and others participated.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీ క‌ల్యాణ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో హంస వాహ‌నం

తిరుపతి,2018 ఫిబ్రవరి 07: శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో బుధ‌వారం రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు వీణ ధరించి సరస్వతీరూపంతో భక్తులను అనుగ్ర‌హించారు. సారం లేనిదాన్ని వదలి, సారవంతమైన దాన్ని స్వీకరించే ఉత్తమజ్ఞానానికి హంస సంకేతం. జ్ఞానరూప పరమహంస అయిన కల్యాణ వేంకటేశ్వరుడు భౌతికరూపమైన హంసగా రూపొంది తన దివ్యతత్తాన్ని వెల్లడిస్తాడు. హంస సరస్వతికీ వాహనం. కనుక కల్యాణదేవుడు సరస్వతీరూపంతో వీణాపుస్తకపాణియై దర్శనమివ్వడం జ్ఞానవిజ్ఞానచైతన్య శుద్ధసత్త్వగుణానికి నిదర్శనం. భక్తులు హంసల వలె నిర్మలమనస్కులై ఉంటే, వాళ్ల హృదయాల్లో తాను శాశ్వతంగా అధివసించి ఉంటానని ఈ వాహనం ద్వారా స్వామివారు సెలవిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటయ్య, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీనివాసులు, డిప్యూటి ఇఇ శ్రీ రామూర్తి, ప్రధాన కంకణబట్టార్‌ శ్రీ బాలాజీ రంగాచార్యులు, ఏఈ శ్రీ నాగరాజు, ఎవిఎస్వో శ్రీ గంగారాజు, ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.