HAMSA VAHANAM OBSERVED_ హంస వాహనం
Tirupati, 25 February 2019: On the first day evening on Monday as a part of the ongoing annual brahmotsavams in Sri Kapileswara Swamy temple in Tirupati, Hamsa Vahanam was observed.
The processional deity of Sri Kapileswara Swamy took celestial ride on the divine swan carrier in the mada streets between 7pm and 9pm.
Devotees made a beeline all along the procession path to witness the Lord on Vahanam.
Temple DyEO Sri Subramanyam, VGO Sri Ashok Kumar Goud, AEO Sri Nagaraj, Suptd Sri Rajkumar, Archakas and devotees took part.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
హంస వాహనం :
ఫిబ్రవరి 25, తిరుపతి, 2019: రాత్రి 7 నుండి 9 గంటల వరకు హంస వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో విహరించనున్నారు. ఆది దంపతులైన స్వామి, అమ్మవార్లు హంస మిథునం(దంపతులు)లా గోచరిస్తారు. వారి వల్లనే అష్టాదశ విద్యలు పరిణమించాయి. పాలను, నీటిని వేరు చేసే వివేకం అలవడింది. కపిలాది యోగీశ్వరుల మానస సరస్సులో హంస జంటగా స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, విజివో శ్రీ అశోక్ కుమార్ గౌడ్, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ నాగరాజు, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్, అర్చకులు శ్రీ స్వామినాథ స్వామి, శ్రీ విజయస్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టరు శ్రీ రెడ్డిశేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.