HANUMAN IS A ROLE MODEL TO YOUTH _ హనుమంతుడు యువతకు ఆదర్శప్రాయుడు

Tirumala, 04 June 2024: As part of Janani Anjana Sametha Balanjaneyaswami vari Jayanthi Mahotsavalu, in the Mahatmula Sandesam program held on Tuesday, Sri Anupamananda Maharaj, General Secretary of Ramakrishna Mutt from Kadapa rendered Anugraha Bhashanam at Nada Neerajana mandapam in Tirumala.
 
Speaking on the occasion he said, Lord Hanuman is a youth icon for strength, will power, loyalty and truthfulness.
 
Wherever there is Ram there comes Hanuman. Such is the pious bond which everyone should follow in their lives, he added.
 
Dr Vibhishana Sharma, Special Officer of SVIHVS was also present.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

హనుమంతుడు యువతకు ఆదర్శప్రాయుడు

తిరుమల, 04 జూన్ 2024: జననీ అంజనా సమేత బాలాంజనేయస్వామి వారి జయంతి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం జరిగిన మహాత్ముల సందేశం కార్యక్రమంలో కడపకు చెందిన రామకృష్ణ మఠం ప్రధాన కార్యదర్శి శ్రీ అనుపమానంద మహారాజ్ తిరుమలలోని నాద నీరాజన మండపంలో అనుగ్రహ భాషణం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హనుమంతుడు శక్తి, సంకల్ప శక్తి, విధేయత, నిజాయతీకి చిహ్నం అని యువతకు ఆదర్శనీయుడని ఉద్ఘాటించారు .

రాముడు ఎక్కడ ఉంటే హనుమంతుడు అక్కడ కొలువై ఉంటాడని, పవిత్రమైన స్వామి భక్తికి నిదర్శనమని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అనుసరించాల్సిన పవిత్రమైన బంధం అలాంటిదేనని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేద అధ్యయన సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ విభీషణ శర్మ కూడా పాల్గొన్నారు.

టిటిడి ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయబడినది