HANUMAN JAYANTHI OBSERVED _ తిరుమలలో హనుమజ్జయంతి
Tirumala, 17 May 20: The festival of Hanuman Jayanthi was observed in Tirumala on Sunday.
The day started with melodious Annamayya Sankeertans penned in praise of Lord Hanuman rendered by renowned Annamacharya Project artist Sri B Raghunath and team.
He rendered two top notes, “Periginadu Choodaro Pedda Hanumantudu” at the beginning of Yoga Vasishtya Dhanwantari Mantra Pathanam and concluded with another specimen “Okkade Ekanta Veerudu”, songs and enhanced the spiritual fervour of the live programme.
Later, the special abhishekam was performed to Sri Bedi Anjaneya Swamy present in front of Tirumala temple. The programme is followed with the Additional EO Sri AV Dharma Reddy, presenting the silk vastrams on behalf of TTD to Sri Anjaneya Swamy located at Japali Theertham.
While in the evening, special puja was performed to the mammoth statue of Sri Anjaneya Swamy located at seventh mile in First Ghat road.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో హనుమజ్జయంతి
తిరుమల, 2020 మే 17: తిరుమలలో హనుమజ్జయంతిని ఆదివారం నిర్వహించారు. ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ దశమినాడు తిరుమలలో హనుమజ్జయంతిని నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి, కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ఆధ్వర్యంలో నాదనీరాజనం వేదికపై “యోగవాశిస్టం – శ్రీ ధన్వంతరి మహామంత్రం” పారాయణంలో భాగంగా 38వ రోజైన ఆదివారం ఉదయం అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి పాల్గొన్నారు
అనంతరం శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 9.00 గంటలకు ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి మధ్యాహ్నం 3.00 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు.
తిరుమలలోని జాపాలి శ్రీ ఆంజనేయస్వామివారికి టిటిడి పట్టు వస్త్రాలు సమర్పణ –
తిరుమలలోని జాపాలి తీర్థంలో గల శ్రీ ఆంజనేయస్వామివారికి హనుమజ్జయంతి సందర్భంగా టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి ఆదివారం ఉదయం పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
కారోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా శ్రీ ఆంజనేయస్వామివారికి అభిషేకం, పూజ కార్యక్రమాలను ఏకాంతంతగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్, ఆరోగ్యశాఖాధికారి డా.ఆర్.ఆర్.రెడ్డి, విజివో శ్రీ మనోహర్ తదితరలు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.