HANUMAN JAYANTHI ON MAY 10 IN TIRUMALA

Tirumala, 9 May 2018: The various locations with the statues of Anjaneya Swamy in Tirumala have geared up to observe Hanuman Jayanthi in a big manner.

The temple priests will perform special Panchamritha Abhishekam with milk, curd, honey, coconut water and Sandal paste to the Bedi Anjaneya Swamy temple which is situated in front of the main temple.

Special pujas will also be observedd to the Konerugattu Anjaneya Swamy located opposite Sri Bhu Varaha Swamy temple and in the evening at around 3pm special pujas will be performed to the 60-ft tall Prasanna Anjaneya Swamy at the seventh mile on the first ghat road.

TTD has made elaborate arrangements including free transportation bus facility for the sake of the locals and pilgrims to carry them from Tirumala to Seventh Mile and back to Tirumala on this festival day from 11am till 6pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFIER, TTDs, TIRUPATI

హనుమజ్జయంతికి ఏర్పాట్లు పూర్తి

మే 09, తిరుమల, 2018: తిరుమలలో మే 10వ తేదీ గురువారం నిర్వహించనున్న హనుమజ్జయంతి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి, కాలినడకబాటలో ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీప్రసన్న ఆంజనేయస్వామి వారికి హనుమజ్జయంతినాడు విశేషంగా అభిషేక, అర్చన, నివేదనలు నిర్వహిస్తారు.

తిరుమలలోని జాపాలి తీర్థంలో కూడా హనుమజ్జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆరోజు ఉదయం అభిషేక, అర్చన, అలంకార, నివేదనలు చేపడతారు. ఈ హనుమజ్జయంతి నాటికి భక్తులు హనుమదీక్షతో తిరుమల చేరుకొని జాపాలి తీర్థంలో దీక్షను విరమిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొంటారు.

కాగా మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి ఆరోజు సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను టిటిడి నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు టిటిడి భక్తుల సౌకర్యార్థం ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించింది. తిరుమలలోని స్థానికులు, భక్తులు తిరుమల నుండి ఏడవ మైలుకు తిరిగి తిరుమల చేరడానికి ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా టిటిడి తెలియజేస్తోంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.