SRI GT BTU POSTERS RELEASED_ శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

Tirupati, 9 May 2018: Tirupati JEO Sri P Bhaskar on Wednesday released the posters of annual brahmotsavams of Sri Govinda raja Swamy temple at Tirupati.

The big annual event is scheduled from May 21 to 29 with Ankurarpanam on May 20. The important days includes Dhwajarohanam on May 21, Garuda Seva on May 25, Rathotsavam on May 28 and Chakrasnanam on May 29.

Temple DyEO Smt Varalakshmi, SE Sri Ramesh Reddy and AEO Sri Uday Bhaskar Reddy were present during poster release which took place at SPRH in Tirupati.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFIER, TTDs, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

మే 09, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే 21 నుంచి 29వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల గోడపత్రికలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆవిష్కరించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతిగృహంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు మే 16న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, మే 20న అంకురార్పణ జరుగనున్నాయన్నారు. తిరుపతి, పరిసర ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో బ్రహ్మోత్సవాలకు విచ్చేసి వాహనసేవలను తిలకించాలని కోరారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహిస్తామన్నారు.

తేదీ ఉదయం సాయంత్రం

21-05-2018(సోమవారం) ధ్వజారోహణం(మిథున లగ్నం) పెద్దశేష వాహనం

22-05-2018(మంగళవారం) చిన్నశేష వాహనం హంస వాహనం

23-05-2018(బుధవారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
24-05-2018(గురువారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

25-05-2018(శుక్రవారం) మోహినీ అవతారం గరుడ వాహనం

26-05-2018(శనివారం) హనుమంత వాహనం గజ వాహనం

27-05-2018(ఆదివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

28-05-2018(సోమవారం) రథోత్సవం అశ్వవాహనం

29-05-2018(మంగళవారం) చక్రస్నానం ధ్వజావరోహణం.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.