HANUMAN JAYANTI IN EKANTAM _ జూన్ 4న శ్రీ కోదండరామాల‌యంలో ఏకాంతంగా హనుమజ్జయంతి

Tirupati, 3 Jun. 21: Hanuman Jayanti will be observed in Ekantam in Sri Kodanda Rama Swamy temple at Tirupati on June 4 in view of Covid guidelines.

Special Pujas will be performed to the presiding deity of Sri Anjaneya Swamy located in front of the temple.

Abhishekam will be performed to this Anjaneya at 8am followed by Special Pujas.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 4న శ్రీ కోదండరామాల‌యంలో ఏకాంతంగా హనుమజ్జయంతి

తిరుపతి, 2021 జూన్ 03: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆల‌యంలో జూన్ 4న శుక్ర‌వారం హనుమజ్జయంతి ఏకాంతంగా జ‌రుగ‌నుంది. కోవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో సాయంత్రం జ‌ర‌గాల్సిన హ‌నుమంత వాహ‌న‌సేవ‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

శరణాగత భక్తికి ఆదర్శంగా నిల్చిన ఆంజనేయస్వామివారి జయంతిని టిటిడి ఆనవాయితీగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆల‌యానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సంద‌ర్భంగా ఉదయం 8 గంట‌ల‌కు శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి మూల‌వ‌ర్లకు అభిషేకం చేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.