VENGAMAMBA STONE MANDAPAM FETE HELD _ తిరుమ‌ల‌లో రాతి మండ‌ప‌మున‌కు వేంచేసిన శ్రీ‌వారు

Tirumala, 03 June 2021: As per tradition Sri Malayappa Swamy and His consorts paid a ceremonial visit to Rocky Mandapam Matrusri Tarigonda Vengamamba, the saint poetess who penned sankeertans on Srivaru on Thursday.

As a tradition, every year ten days after Sri Narasimha Jayanti, Sri Malayappa accompanied by His consorts goes on a procession to this rock mandapam located on North Mada Street, which was believed to have been resided by Vengamamba.

As a token of the ardent services of Vengamamba, Srivaru with His Consorts receives her hospitality followed by Asthanam after Sahasra Deepalankara Seva.

TTD Board Member Sri Sampath Ravinarayana took part.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమ‌ల‌లో రాతి మండ‌ప‌మున‌కు వేంచేసిన శ్రీ‌వారు

తిరుమ‌ల‌, 2021 జూన్ 03: శ్రీవేంకటేశ్వరస్వామివారికి పరమభక్తురాలైన మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ రాతి గృహ‌మున‌కు ముందు ఉన్న రాతి మండ‌ప‌ము వ‌ద్ద‌కు గురువారం సాయంత్రం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప స్వామివారు విచ్చేశారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌త్యేక పూజా కార్య‌క్ర‌మాలు, ఆస్థానం నిర్వ‌హించారు.

ప్ర‌తి ఏడాది న‌ర‌సింహ జ‌యంతి త‌రువాత‌ 10వ రోజున‌ స‌హ‌స్ర దీపాలంకార సేవ అనంత‌రం ఉత్త‌ర మాడ వీధిలోని రాతి మండ‌ప‌ము వ‌ద్ద‌కు శ్రీ‌వారు ఉభ‌య దేవేరుల‌తో క‌లిసి ఊరేగింపుగా వేంచేయ‌డం ఆన‌వాయితిగా వ‌స్తుంది.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది