HANUMANTHA VAHANA SEVA HELD _ హనుమంత వాహనంపై శ్రీరాముడి తేజసం

TIRUPATI, 25 MARCH 2023: The Hanumantha Vahana Seva was held with utmost religious fervour on Saturday in Tirupati.

On the sixth day morning of the ongoing annual brahmotsavam in Sri Kodandaramalayam, Sri Rama took out a celestial ride on Hanumantha Vahana to bless His devotees.

Both the senior and junior pontiffs of Tirumala, DyEO Smt Nagaratna, AEO Sri Mohan and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హనుమంత వాహనంపై శ్రీరాముడి తేజసం

తిరుపతి, 2023 మార్చి 25: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు శనివారం ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం నుండి తెలుస్తోంది. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తారు.

అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిచారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, కొబ్బరినీళ్లు, చందనంలతో అభిషేకం చేశారు.

వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి,
డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ మోహన్, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, కంకణబట్టర్ శ్రీ ఆనంద్ కుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ సురేష్, శ్రీ చలపతి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.