HANUMANTHA VAHANA SEVA IN EKANTAM _ హనుమంత వాహనంపై శ్రీ కల్యాణ వెంకన్న అభయం
TIRUPATI, 14 JULY 2021: As part of ongoing annual Sakshatkara Vaibhavam at Srinivasa Mangapuram, on the second day evening Hanumantha Vahana Seva took place.
Earlier during the day Snapana Tirumanjanam was performed to the processional deities.
Due to Covid restrictions, all the temple events took place in Ekantam.
Temple DyEO Smt Shanti, Temple Suptd Sri Chengalrayulu and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
హనుమంత వాహనంపై శ్రీ కల్యాణ వెంకన్న అభయం
తిరుపతి, 2021 జులై 14: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవంలో రెండో రోజైన బుధవారం రాత్రి స్వామివారికి హనుమంత వాహనంపై ఏకాంతంగా ఆస్థానం నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.
అనంతరం సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారిని కొలువుదీర్చి ఆస్థానం చేపట్టారు. జులై 15న గరుడ వాహనసేవ ఆస్థానం జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధనంజయుడు, సూపరింటెండెంట్లు శ్రీ రమణయ్య, శ్రీ చెంగల్రాయలు, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ శ్రీ యోగానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.