HARIDASA SANKEERTANS IN PUBLIC DOMAIN- ADDL.EO _ జ‌న ‌బాహుళ్యంలోకి హ‌రిదాస సంకీర్త‌న‌లు – అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

TTD ADDL.EO RELEASES HARIDASA SARVASVAM VOLUMES

 Tirumala, 1 Apr. 21: The mission of TTD is to place all Haridasa and Annamacharya sankeetans in public domain as a part of Hindu Sanatana Dharma Pracahara, said TTD Additional EO Sri AV Dharma Reddy.

As Chief Guest the Additional EO released several volumes of sankeetans at Asthana Mandapam at Tirumala on Thursday on the occasion of Sri Vyasaraja Thirtha Aradhanotsavam held under aegis of TTD Dasa Sahitya project in total adherence to COVID-19 guidelines.

Speaking on the occasion he said as per the decision of the board TTD has taken up publication of 7000 Sankeertans of Sri Purandara Dasa (out of 4.75 lakh sankeetans penned by the saint).

 

He said TTD has launched a campaign to gather most of sankeetans of Purandara Dasa in possession of individuals and institutions in Karnataka and publish them.

Presently the sankeetans are published in the Kannada language and later they would be published in Telugu, Tamil and Hindi with relevant commentaries.

The Additional EO said TTD would soon launch in Kannada SVBC channel will give priority space to telecast Sri Purandara Dasa sankeetans by producing special episodes of sankeetans recorded by the Dasa Sahitya project.

TTD is also mulling to take up live telecast of special programs on Kannada SVBC by roping eminent singers of Karnataka to take the sankeetans to the people.

He appealed to all artists of Dasa Sahitya project to take the Dasa sankeetans to every doorstep of devotees in Karnataka through SVBC and distribution of sankeetan volumes.

Earlier the Additional EO along with the Special Officer of Dasa Sahitya project unveiled the first and second volumes of Dasa Sahitya Sarvasvsm.

Speaking on the occasion the SO of the Dasa Sahitya project, Sri Anandathirthacharya said the saint-poet Sri Vyasaraja had resided at Tirumala for 12 years to script thousands of sankeetans on Sri Venkateswara. Presently TTD has compiled sankeetans of Haridasas Sri Narahari Thirtha, Sri Jaya thirtha, Sri Sri Padaraja and Sri Vyasaraja in two volumes titled Sarvasvsm comprising of 200 and 300 sankeetans in First and Second volumes respectively.

Sub-Editor Dr Narasimhacharya, Pandit Parishad member Sri Nagarajacharya and 500 artists of the Dasa Sahitya project were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

జ‌న ‌బాహుళ్యంలోకి హ‌రిదాస సంకీర్త‌న‌లు – అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

– దాససాహిత్య స‌ర్వ‌స్వ గ్రంథాలు ఆవిష్క‌ర‌ణ‌

తిరుమ‌ల, 2021 ఏప్రిల్ 01: కర్ణాటక హ‌రిదాసవరేణ్యుల సంకీర్త‌న‌లను, శ్రీ తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనలను ప్రజలందరికీ చేరువ చేసేందుకు టిటిడి కృషి చేస్తోంద‌ని అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో శ్రీ వ్యాస‌రాజ తీర్థుల ఆరాధ‌నోత్స‌వాలు తిరుమ‌ల ఆస్థాన మండ‌పంలో గురువారం ఉద‌యం జ‌రిగింది. కోవిడ్ – 19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అద‌న‌పు ఈవో మాట్లాడుతూ టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యం మేర‌కు దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కర్ణాటక హ‌రిదాసవరేణ్యుల లక్షలాది కీర్తనలను ముద్రించి భ‌క్తుల‌కు అందించ‌నున్న‌ట్లు తెలిపారు. ఒక్క పురంద‌ర‌దాసుల వారు ర‌చించినవే 4.75 ల‌క్ష‌ల కీర్త‌నలు ఉన్నాయని తెలిపారు. వాటిలో దాదాపు 7 వేల కీర్త‌నలు మాత్రమే లభిస్తున్నాయి. హ‌రిదాసుల సంకీర్త‌నల ప్ర‌తులు ‌క‌ర్ణా‌ట‌క‌లోని చాలా మంది భ‌క్తుల వ‌ద్ద ఉన్నట్లు, వాటిని సేక‌రించి ముద్రిస్తామన్నారు. ప్ర‌స్తుతం క‌న్న‌డ భాష‌లో ఈ సంకీర్త‌న‌లు ముద్రిస్తున్నామ‌ని, రాబోవు కాలంలో తెలుగు, త‌మిళం, హిందీ బాషాల్లో అర్థ‌, తాత్ప‌ర్యా‌ల‌తో ముద్రించి భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు వివ‌రించారు.

త్వ‌ర‌లో క‌న్న‌డ‌లో ఎస్వీబీసీ ఛాన‌ల్ ప్రారంభించి, పురంద‌ర దాసుల కీర్త‌న‌లకు ప్రత్యేక స‌మ‌యం కేటాయిస్తామ‌న్నారు. టిటిడి రికార్డు చేసిన దాస సాహి‌త్య సంకీర్త‌న‌ల‌పై ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు రూపొందించి ప్ర‌సారం చేస్తామ‌ని చెప్పారు. అదేవిధంగా హ‌రిదాసుల‌ సంకీర్త‌న‌ల‌పై క‌ర్ణాట‌క‌‌లోని ప్ర‌ముఖ‌ సంగీత విద్వాంసులతో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసి భ‌క్తులంద‌రికి చేరువ‌య్యేలా చేస్తామ‌న్నారు. దాస సాహిత్య ప్రాజెక్టు క‌ళాకారులంద‌రు దాస సంకీర్త‌న‌లకు విస్తృత ప్ర‌చారం క‌ల్పించి, ప్ర‌తి ఇంటికి ఎస్వీబీసీ, పుస్త‌క రూపంలో అందేలా కృషి చేయాల‌ని ఆయ‌న పిలుపు నిచ్చారు.

అంత‌కుముందు అద‌న‌పు ఈవో, దాస సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యుల‌తో క‌లిసి దాస‌సాహిత్య స‌ర్వ‌స్వ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంపుటాలను ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా దాస సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు మాట్లాడుతూ శ్రీ వ్యాస‌రాజ య‌తీశ్వ‌రులు 12 సంవ‌త్స‌రాలు తిరుమ‌ల క్షేత్రంలో ఉండి శ్రీ‌వారిని అర్చిస్తూ వేలాది సంకీర్త‌న‌లు ర‌చించిట్లు తెలిపారు. దాసవరేణ్యులైన శ్రీ న‌ర‌హ‌రి తీర్థ‌, శ్రీ జ‌య‌తీర్థ‌, శ్రీ పాద‌రాజ‌, శ్రీ వ్యాస‌రాజ య‌తీశ్వ‌రుల సంకీర్త‌న‌లతో క‌న్న‌డ భాష‌లో రెండు గ్రంథాలు టిటిడి ముద్రించిన‌ట్లు తెలిపారు. ఇందులో దాస‌సాహిత్య స‌ర్వ‌స్వ ప్ర‌థ‌మ గ్రంథంలో 200 సంకీర్త‌న‌లు, ద్వితీయ గ్రంథంలో 300 సంకీర్త‌న‌లు ఉన్న‌ట్లు వివ‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఉపసంపాదకులు డా|| నరసింహాచార్యులు, పండిత ప‌రిష‌త్ స‌భ్యులు శ్రీ నాగ‌రాజాచార్యులు, 500 మంది దాస సాహిత్య ప్రాజె‌క్టు క‌ళాకారులు పాల్గొన్నారు.

ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.2 ల‌క్ష‌లు విరాళం

హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ‌మ‌తి సుధా వేంక‌టేష్ గురువారం శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ట్ర‌స్టుకు రూ.2 ల‌క్ష‌లు విరాళంగా అందించారు.

ఈ మేర‌కు ఈ విరాళం చెక్కును ఆస్థాన మండ‌పంలో అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డికి అందచేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.