HARIKATHA PITAMAHA ANNIVERSARY FROM SEP 6 TO 8 _ సెప్టెంబరు 6 నుండి 8వ తేదీ వరకు శ్రీ ఆదిభట్ట నారాయణదాస 154వ జయంతి ఉత్సవాలు
Tirupati, 02 September: The 154th birth anniversary of the Patriarch of Harikatha Sri Madajjada Adibhatla Narayana dasa will be observed from September 6 to 8.
The anniversary celebrations will be held for three days under the aegis of the Sri Venkateswara Music and Dance college.
According to legend the child prodigy Narayana Dasa born at Ajjada village of Vizianagaram district in 1864 and exhibited exemplary talent in reciting Sanskrit verses- Sataka slokas- at the age of five itself. Famed as a contemporary Kalidasa Narayana dasa had scripted several epics like Savitri Charita, Janaki sapatham, Rukmini Kalyanam and Bhata Markandeya charitra.
He was honored with the coveted title of Pancha Mukeswara for his versatality in Music, Literature and Vedic studies.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
సెప్టెంబరు 6 నుండి 8వ తేదీ వరకు శ్రీ ఆదిభట్ట నారాయణదాస 154వ జయంతి ఉత్సవాలు
తిరుపతి, 02 సెప్టెంబరు 2018; హరికథా పితామహునిగా వినుతికెక్కిన శ్రీమదజ్జాడ ఆదిభట్ట నారాయణదాస 154వ జయంతి ఉత్సవాలు సెప్టెంబరు 6 నుంచి 8వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా సెప్టెంబరు 6వ తేదీ గురువారం ఉదయం 9.00 గంటలకు ఎస్వీ సంగీత కళాశాల ప్రాంగణంలోని శ్రీ ఆదిభట్ట నారాయణదాస విగ్రహానికి పుష్పాంజలి, బృందగానం నిర్వహిస్తారు. సెప్టెంబరు 7 మరియు 8వ తేదీలలో సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.30 గంటల వరకు నారాయణదాస సాహిత్యంపై ప్రముఖ పండితుల పత్ర సమర్పణ, రాత్రి 7.30 గంటల నుండి సీనియర్ హరికథ కళాకారులతో హరికథాగానం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.
శ్రీమదజ్జాడ ఆదిభట్ట నారాయణదాసవర్యులు గురించి..
నారాయణదాసవర్యులు 1864, ఆగస్టు 31వ తేదీన విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామంలో శ్రీలక్ష్మీనరసమాంబ, వేంకటచయన దంపతులకు జన్మించారు. సంగీత, సాహిత్యాల్లో బాల్యం నుంచే ఈయన అద్భుతమైన ప్రతిభాపాఠవాలు ప్రదర్శించేవారు. పోతన భాగవత పద్యాలు, ఇతర శతక పద్యాలను ఐదేళ్ల ప్రాయంలోనే అవలీలగా వల్లించేవారు. ఉపమాన ఉపమేయాలను పోషించండంలో నారాయణదాసవర్యులు కాళిదాస మహాకవికి సమానమైనవారు. వీరు రచించిన హరికథా రచనలు, సాహిత్యగ్రంథాలు, సంగీతరూపకాలు కవి, గాయక, పండితులకు మనోజ్ఞమైన ఆనందాన్ని కలిగించాయి.
ఈయన రచించిన సావిత్రిచరిత్ర, జానకీశపథం, భక్తమార్కండేయ చరిత్ర, రుక్మిణీ కల్యాణం హరికథా వాఙ్మయంలో నాలుగు వేదాలు లాంటివి. ఏకకాలంలో ఐదు విధాల లయలను ప్రదర్శించడం ఈయనకే సాటి. ఈయనకు పంచముఖేశ్వర అనే బిరుదు ఉంది. సంగీత, సాహిత్యాలను సరితూచిన త్రాసు నారాయణదాసు అని తిరుపతి వేంకటకవులు, శ్రీశ్రీ లాంటి మహానుభావులు కొనియాడారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.