GOPUJA MAHOTSAVAM IN GOSHALA _ ఎస్వీ గోశాలలో గోకులాష్టమి ‘గోపూజ’కు ఏర్పాట్లు పూర్తి

Tirupati, 02 September 2018: Gopuja Mahotsavam will be observed in SV Goshala in Tirupati on Monday in connection with Gokulastami.

The series of devotional and cultural events will commence by 10.30am in the premises.

Gopuja will be performed to all the desi cattle located in SV Goshala. The events commences with special puja to Sri Venugopala Swamy located in the Goshala premises.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ గోశాలలో గోకులాష్టమి ‘గోపూజ’కు ఏర్పాట్లు పూర్తి

సెప్టెంబరు 02, తిరుపతి, 2018 ; టిటిడికి చెందిన తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో సెప్టెంబరు 3న సోమవారం జరుగనున్న గోకులాష్టమి గోపూజ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గోపూజ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఉదయం 5 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం, ఉదయం 6 నుండి 9 గంటల వరకు వేణుగానం, ఉదయం 6.30 నుండి 8 గంటలకు ఎస్వీ వేదపాఠశాల విద్యార్థులతో వేదపఠనం నిర్వహిస్తారు. ఉదయం 7.30 నుండి 10 గంటల వరకు దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన, కోలాటం, ఉదయం 8 నుండి 10 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో అన్నమాచార్య సంకీర్తనల కార్యక్రమాలు చేపడతారు.

ఉదయం 10.30 గంటలకు ‘గోపూజ మహోత్సవం’ ఘనంగా జరుగనుంది. ఆ తరువాత శ్రీవేణుగోపాలస్వామివారి సన్నిధిలో పూజ, హారతి ఇస్తారు. సాంస్క తిక కార్యక్రమాల అనంతరం ప్రసాదం పంపిణీ చేస్తారు. సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు హిందూ ధర్మప్రచార పరిషత్‌ కళాకారులతో హరికథ వినిపిస్తారు. ఈ సందర్భంగా పశువుల షెడ్ల వద్ద ఉంచిన బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని టిటిడి కల్పించింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.