HASSLE FREE ARRANGEMENTA BY ENGINEERING DEPARTMENT_ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో రూ.4.65 కోట్లతో సివిల్ ఇంజినీరింగ్‌ పనులు : టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ సి. చంద్రశేఖర్‌రెడ్డి

Tirumala, 17 October 2018: The engineering department of TTD has spent Rs.890.35 lakhs and took up all civil and electrical during the twin Brahmotsavams and successfully made hassle free arrangements.

Addressing reporters at the Media centre of Ram Bagicha rest house in Tirumala, TTD chief engineer Sri Chandrasekhar Reddy, SE-2 Sri Ramachandra Reddy and SE (Electricals) Sri Venkateswarlu briefed on the engineering works.

CE said that while Rs.465.45 lakh worth civil works were accomplished, Rs.424.90 lakhs was spent for electrical works during twin Brahmotsavams in 2018.

SE 2 Sri Ramachandra Reddy said, the department took up setting of barricades for parking lots to facilitate parking of 4 wheelers, built 15 toilet blocks in the galleries of mada streets, arrangements for photo and flower decorations, besides repairs for vahanams, rathams, srivari float and Gatatopanm, queue lines and filled up Swami Pushkanini with 10 million litres of filtered water. He said the department also took up painting of signage, caution boards on ghat roads etc. In short the infrastructure of Tirumala was fully geared for facilitating the devotees for the nine-day festival in a foolproof manner, he said.

SE Electrical said, 33 LED screens were erected with 21 on mada streets and rest of 11 at various locations of Tirumala starting from PAC 2 to VQC 2 to view SVBC live telecast of vahana sevas. He said, TTD has also set up 46 electrical illuminations up to 60 feet height at all prominent locations in Tirumala. A sum of Rs.325. 90 lakhs was spent towards scaffolding, generators, labor and designs for both Brahmotsavams. The SE said high definition signals; HD convertors and fiber optic cables were used to enable good resolution, more brightness and clarity.

The Public Address System with additional speakers, batteries and trolley were provided to each cultural team to have uniformity.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో రూ.4.65 కోట్లతో సివిల్ ఇంజినీరింగ్‌ పనులు : టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ సి. చంద్రశేఖర్‌రెడ్డి

అక్టోబర్ 17, తిరుమల 2018: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తుల సౌకర్యార్థం రూ.4.65 కోట్లతో సివిల్ ఇంజినీరింగ్‌ పనులను చేశామని చేపట్టామని టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో బుధ‌వారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి పుష్కరిణిలో 10 మిలియన్‌ లీటర్ల పరిశుభ్రమైన నీటిని నింపి బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేసినట్టు తెలిపారు. శ్రీ‌వారి చ‌క్ర‌స్నానం రోజున భ‌క్తులు స్నానం ఆచ‌రించేందుకు వేరువేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. వాహనసేవలను తిలకించేందుకు వచ్చిన భక్తులకు సౌకర్యవంతంగా గ్యాలరీలు, బారీకేడ్లు, నాలుగు మాడ వీధుల్లో భజనమండపాలను ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి ఆలయం, గోపురాలు, ప్రాకారం మాడ వీధుల్లో పెయింటింగ్‌, రంగోళిలు, ఫ‌ల‌పుష్ప‌ ప్రదర్శన, ఫోటో ఎగ్జిబిష‌న్ ఏర్పాట్లు చేసిన‌ట్లు వివ‌రించారు.

అనంత‌రం ఎస్ఇ శ్రీ రామ‌చంద్రారెడ్డి మాట్లాడుతూ రెండు ఘాట్‌రోడ్ల‌లో స్వాగ‌త ఆర్చీలు, తిరుమ‌ల‌లోని ముఖ్య ప్రాంతాల‌ను గుర్తించేందుకు అవ‌స‌ర‌మైన మ్యాప్‌లు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. శ్రీవారి వాహ‌నాల‌కు మ‌ర‌మ‌త్తులు, తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో వివిధ వాహనాల పార్కింగ్‌కు అవ‌స‌ర‌మైన ఏర్ప‌ాట్లు చేసిన‌ట్లు తెలిపారు. అదేవిధంగా,
నూతన శ్రీవారి సేవాసదన్‌, ఔటర్ రింగ్‌ రోడ్డు ప్రాంతాలలో అదనంగా పార్కింగ్‌ ఏర్పాట్లను త్వరలో పూర్తి చేస్తామన్నారు. మాడ వీధుల‌లో నూత‌నంగా 15 మ‌రుగుదొడ్లు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. తిరుమ‌ల‌లోని కాటేజిలు, పిఎసిలు, అతిథి గృహ‌ల‌లో నిరంత‌రాయంగా నీటి స‌ర‌ఫ‌రా చేశామన్నారు.

ఎస్ఇ (ఎల‌క్టిక‌ల్‌) శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు మాట్లాడుతూ రూ.4.75 కోట్లతో ఎల‌క్టిక‌ల్ లైటింగ్‌ ఏర్పాట్లు చేపట్టామన్నారు. తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఎల్‌ఇడి తో త‌యారు చేసిన 60 అడుగులవి 46, 30 అడుగులవి 23 వివిధ దేవ‌తా మూర్తుల విద్యుద్దీపాల కటౌట్లు, 6 ఆర్చీలు, తోర‌ణాలతో అలంకరించామన్నారు. ఎల్‌ఇడి లైట్లు ఉప‌యోగించ‌డం ద్వారా 2.7 ల‌క్ష‌ల యూనిట్లు విద్యుత్‌ను ఆదా చేసామని తెలిపారు.

అదేవిధంగా భక్తులు శ్రీవారి సేవలను తిలకించేందుకు రేడియో అండ్ బ్రాడ్ కాస్టింగ్ విభాగం ఆధ్వ‌ర్యంలో నాలుగు మాడ‌ వీధుల్లో 22, ఇతర ప్రాంతాల్లో 12 కలిపి మొత్తం 34 డిజిటల్‌ స్క్రీన్లను ఏర్పాటు చేశామన్నారు. భ‌జ‌న మండ‌ళ్ల‌కు యూనిఫాం సౌండ్ సిస్టంను అందించామని, భక్తులకు నిరంత‌రాయంగా ప్ర‌క‌ట‌న‌ల ద్వారా సమాచారాన్ని చేరావేశామన్నారు.

ఈ సమావేశంలో ప్రజాసంబంధాల అధికారి డా. టి.ర‌వి, ఇఇ శ్రీ సుబ్ర‌మ‌ణ్యం పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.