OVER SEVEN LAKHS HAD DARSHAN IN SEVEN DAYS-TEMPLE Dy EO_ శ్రీవారి బ్రహ్మోత్సవాల‌లో సామాన్య భక్తులకు పెద్దపీట – దాదాపు 6.54 లక్షల మందికి సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌

Tirumala, 17 October 2018: So far 6.54 lakh pilgrims had enjoyed the celestial darshan of Sri Venkateswara Swamy during the last eight days (including Ankurarpanam day) during the ongoing Srivari Navaratri Brahmotsavms in Tirumala, said Tirumala Temple DyEO Sri Harindranath.

Addressing reporters at the Media center in Ram Bagicha 2 Rest house on Wednesday, the DyEO said, to give priority for common devotee oriented sarva darshan, TTD had slashed the VIP break darshan, Rs.300 special entry darshan and cancelled all arjitha sevas.

Advance preparedness had facilitated provision of darshan of Lord inside and also the darshan of Vahana sevas in a smooth manner, he said. Adding to that he said, excepting for the period of rituals, rest of time was devoted for common devotee darshan.

The Temple DyEO said that nearly 7.15 lakh devotees had darshan in September Brahmotsavams. During the Salakatla Brahmotsavams last month about 85,000 had darshan on Garuda seva day (September 17) while on Garuda seva during Navarathri Brahmotsavams on October 14, over one lakh people had darshanam of presiding Lord. In the last seven days we have sold 24.36lakh laddus to pilgrims.

HUNDI COLLECTIONS TOUCH Rs 16.14 CRORE

The Parakamani DyEO Sri V Damodaram said that during the ongoing Srivari Navaratri Brahmotsavams, the Srivari Hundi collections have touched Rs.16.14 Crore in seven days as against Rs.16.28 Crore collections during the Salakatla Brahmotsavams last month.

The Hundi collections were counted and segregated with the assistance of countless Parakamani volunteers and deposited in the banks, he added.

Among others the TTD PRO Dr T Ravi and Srivari Temple Peishkar Sri Ramesh Babu and Potu Peishkar Sri Nagaraju also participated.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీవారి బ్రహ్మోత్సవాల‌లో సామాన్య భక్తులకు పెద్దపీట – దాదాపు 6.54 లక్షల మందికి సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌

తిరుమల, 17 అక్టోబరు 2018: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 7 రోజుల్లో దాదాపు 6.54 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించినట్లు శ్రీవారి ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ హ‌రీంద్ర‌నాధ్ తెలిపారు.

బుధ‌వారంనాడు రాంభగీచా 2లోని మీడియా సెంటర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో విఐపి దర్శనాలు, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల‌ను తగ్గించి సామాన్య భక్తులకు పెద్దపీట వేశామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు నిర్వహణ, తక్కువ వ్యవధిలో సంతృప్తికర దర్శనం కల్పించినట్లు వివరించారు. స్వామివారి వాహన సేవలు వీక్షించిన భక్తులందరికి శ్రీవారి దర్శనం కల్పించినట్లు తెలిపారు. శ్రీవారి కైంకర్యాల సమయంలో తప్ప మిగిలిన సమయం అంతా శ్రీవారిని దర్శించుకున్నట్లు వివరించారు. భక్తులకు స్వామివారి అన్న ప్రసాదాలు అధికంగా పంపిణీ చేసినట్లు తెలియజేశారు.

కాగా అక్టోబ‌రు 14వ తేదీ గ‌రుడ‌సేవ‌నాడు ల‌క్ష మందికి పైగా భ‌క్తులు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నార‌ని వెల్ల‌డించారు. శ్రీ‌వారి భ‌క్త‌ల‌కు ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 24.36 ల‌క్ష‌ల ల‌డ్డూలు అందించామ‌న్నారు. బ్రహ్మోత్సవాలలో భక్తుల సౌకర్యార్ధం ముందస్తుగా 7 లక్షల లడ్డూలు సిద్ధంగా వుంచినట్లు తెలిపారు.

అదేవిధంగా శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలలో 7.15 ల‌క్ష‌ల మంది భ‌క్తులు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న‌ట్లు తెలిపారు. సెప్టెంబ‌రు 17వ తేదీ గ‌రుడ‌సేవ సంద‌ర్భంగా దాదాపు 85 వేల మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించామ‌న్నారు. సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలలో దాదాపు 26.30 ల‌క్ష‌ల ల‌డ్డూలు భ‌క్తుల‌కు అందించిన‌ట్లు తెలిపారు. ప్రతి రోజు శ్రీవారి వాహన సేవల్లో అర్చ‌కులు ప్రత్యేకంగా అలంకరణలు చేసినట్లు తెలియజేశారు.

శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ సారధ్యంలో, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు నేతృత్వంలో అధికారులు, సిబ్బంది సమష్టిగా పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశామని ఆయన వెల్లడించారు.

శ్రీ‌వారి హుండి ద్వారా 16.14 కోట్లు ల‌భించింది : ప‌ర‌కామ‌ణి డెప్యూటీ ఈవో శ్రీ వి.దామోద‌రం

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలలో హుండి ద్వారా ఈ ఏడాది 7 రోజులకు రూ. 16.14 కోట్లు లభించినట్లు తెలిపారు. అదేవిధంగా శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలలో 9 రోజుల‌కు హుండి ద్వారా రూ.16.28 కోట్లు లభించినట్లు వెల్లడించారు.

శ్రీ‌వారి ప‌ర‌కామ‌ణి సేవ‌కుల స‌హ‌కారంతో స్వామివారి కానుక‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు లెక్కింపు పూర్తిచేసి బ్యాంకుల‌లో డిపాజిట్ చేస్తున్న‌ట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా. టి.ర‌వి, పేష్కార్లు శ్రీ రమేష్‌బాబు, శ్రీ నాగ‌రాజ‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.