HENCEFORTH “SUNDARA TIRUMALA-SUDDHA TIRUMALA” WILL BE OBSERVED ON A DAY EVERY MONTH – TTD EO _ నెలలో ఒక రోజు “సుందర తిరుమల – శుద్ధ తిరుమల” ఆచరిస్తాం – టీటీడీ ఈఓ

HAILS THE TEAM SPIRIT OF TTD EMPLOYEES DURING HIGH TIME

 

EMPLOYEES TAKE PLEDGE TO KEEP TIRUMALA ENVIRONS CLEAN AND HYGIENE

 

Tirumala, 01 May 2023: The slogan, “Sundara Tirumala-Suddha Tirumala”  will henceforth be observed every month involving the strong workforce of TTD keeping the Tirumala environs clean, green and hygiene for the sake of the multitude of visiting devotees, said TTD EO Sri AV Dharma Reddy.

 

Addressing the TTD employees who are deputed to perform Shramadan (voluntary cleaning service) along with Srivari Sevaks at different parts in Tirumala at Asthana Mandapam on Monday the EO said, TTD is not a corporate institution or any industry to close the doors if someone goes on a lightning strike without prior notice and will never yield to such blackmailing tactics.

 

“Be the officers, or employees or sanitary staff,  all our salaries are being paid by the offerings made by the devotees coming from different parts of the country and across the globe in Srivari Hundi. Everyone should keep in mind that devotees and pilgrims are our “Pratyaksha Daivam ”(visible divine) and it becomes our foremost responsibility to serve them with dedication. I really appreciate the services of the workforce of TTD who joined hands and rose up to the situation during the time of crisis without causing any hindrance to devotee services, he asserted.

 

The EO also said, “The Father of Nation-Mahatma Gandhi” stood a role model for “Swachchta” and he always cleaned the premises himself, hence today the logo of Swachch Bharat is the spects of Mahatma. Taking this inspiration, henceforth, every employee should work for a day in a month in the Sundara Tirumala -Suddha Tirumala programme”, he maintained.

 

Later a pledge was administered on Sundara Tirumala-Suddha Tirumala.

 

Later, the EO extending thanks said, “My heartfelt thanks to all the Srivari Sevaks, especially Sri Bheem Reddy and his team from Kurnool who have come voluntarily to offer exclusively sanitation services on learning the news about the lightning strike of sanitary workers in the media in Tirumala.

 

Besides the JEOs, District Collector, SP, TMC Commissioner have also offered their support and mobilised manpower withdrawing sanitary staff from nearby areas of Chittoor, Tirupati, Sri Kalahasti, Nellore, Kadapa etc. and deployed in Tirumala to overcome the crisis at the need of hour. The Collector has even participated in the cleaning programme. I thank them all for their solidarity”, he added.

 

JEO Sri Veerabrahmam, CEO SVBC Sri Shanmukh Kumar, Health Officer Dr Sridevi, PRO Dr T Ravi, Estates OSD Sri Mallikarujuna and other top officials of TTD from various departments, HoDs, employees were also present.

 

TIRUMALA MEDIA ALSO PARTICIPATES

 

Extending their solidarity to the TTD’s Sundara Tirumala-Suddha Tirumala, the representatives of both Print and Electronic Media working in Tirumala have voluntarily participated in the programme and cleaned the premises at the Press Club area, SMC, SMGH and other surrounding places. 

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నెలలో ఒక రోజు “సుందర తిరుమల – శుద్ధ తిరుమల” ఆచరిస్తాం – టీటీడీ ఈఓ

– క్లిష్ట సమయంలో టీటీడీ ఉద్యోగుల స్పూర్తి అభినందనీయం

– తిరుమల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ఉద్యోగులు ప్రతిజ్ఞ

తిరుమల, 2023 మే 01: తిరుమల పరిసరాలను పరిశుభ్రంగా, పచ్చగా ఉంచేందుకు టీటీడీ పటిష్టమైన కార్యవర్గంతో ‘సుందర తిరుమల-శుద్ధ తిరుమల’ అనే నినాదాంతో ఇక నుంచి ప్రతి నెలా శ్రమదానం కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీటీడీ ఈఓ శ్రీ ఎవి ధర్మారెడ్డి తెలిపారు. సోమవారం తిరుమలలోని ఆస్థాన మండపం వద్ద టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకులతో కలిసి ఈఓ శ్రమదానం (స్వచ్ఛంద పరిశుభ్రత సేవ) నిర్వహించారు.

ఈ సందర్భంగా టీటీడీ ఉద్యోగులను ఉద్దేశించి ఈఓ మాట్లాడుతూ, ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత హైంద‌వ ధార్మిక సంస్థ అయిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాలు ఎవరైనా వెళితే తలుపులు మూసేసే కార్పొరేట్‌ సంస్థ కానీ, పరిశ్రమ కానీ కాదన్నారు. ముందస్తు నోటీసు లేకుండా మెరుపు సమ్మె చేయడం వంటి బెదిరింపులకు టీటీడీ ఎన్నటికీ లొంగదని చెప్పారు. ‘‘ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులు శ్రీవారి హుండీలో సమర్పించే కానుకలతోనే అధికారులకు, ఉద్యోగులకు, శానిటరీ సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నారన్నారు. భక్తుల సేవే భగవంతుడి సేవగా భావించి అంకితభావంతో సేవ చేయడం మన ముందున్న బాధ్యత అన్నారు. ఆపద సమయంలో భక్తుల సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చేయి చేయి కలిపి పరిస్థితిని చక్కదిద్దిన టీటీడీ సిబ్బంది సేవలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

“జాతిపిత-మహాత్మా గాంధీ” “స్వచ్ఛత”కి ఆదర్శంగా నిలిచారని, ఆయన ఎల్లప్పుడూ తన ప్రాంగణాన్ని స్వయంగా శుభ్రం చేసేవాడని, అందుకే ఈ రోజు స్వచ్ఛ భారత్ లోగోలో మహాత్ముని కళ్ళద్దాలు ఉందన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక నుంచి ప్రతి ఉద్యోగి సుందర తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమంలో నెలలో ఒకరోజు పని చేయాలి’’ అని ఈఓ పిలుపునిచ్చారు. తరువాత ఉద్యోగులతో సుందర తిరుమల-శుద్ధ తిరుమలపై ప్రతిజ్ఞ చేయించారు.

”మీడియాలో పారిశుధ్య కార్మికుల మెరుపు సమ్మె వార్తను తెలుసుకుని కర్నూలుకు చెందిన శ్రీ భీమ్‌రెడ్డి 100 మందికి పైగా సేవకులను తిరుమలకు తీసుకువచ్చి స్వచ్ఛందంగా పారిశుధ్య సేవలందిస్తున్నట్లు చెప్పారు. స్వామివారి సేవలోనే కాకుండా ప్రత్యేకించి పారిశుధ్య సేవలందిస్తున్న శ్రీవారి సేవకులందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు” తెలిపారు.

తిరుమలలో జెఈఓలతో పాటు, జిల్లా కలెక్టర్, ఎస్పి, తిరుపతి మునిసిపల్ కమిషనర్ కూడా తమ మద్దతును అందించారన్నారు. అదేవిధంగా చిత్తూరు, తిరుపతి, శ్రీ కాళహస్తి, నెల్లూరు, కడప మొదలైన సమీప ప్రాంతాల నుండి పారిశుద్ధ్య సిబ్బందిని తిరుమలకు రప్పించి, సంక్షోభాన్ని అధిగమించడానికి సేవలందించారన్నారు. జిల్లా కలెక్టర్‌ తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఈఓ కృతజ్ఞతలు తెలియజేశారు.

జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, పీఆర్వో డాక్టర్ టి.రవి, ఎస్టేట్స్ ఓఎస్డీ శ్రీ మల్లికార్జునతో పాటు టీటీడీలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

తిరుమల మీడియా :

టిటిడి చేపట్టిన సుందర తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ తిరుమలలో పనిచేస్తున్న ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రెస్‌క్లబ్‌, ఎస్‌ఎంసి, ఎస్‌ఎంజిహెచ్‌ తదితర పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.