PANCHAGAVYADHIVASAM HELD _ సీతంపేటలో శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం

SEETAMPETA, 01 MAY 2023: As part of the Maha Samprokshana rituals for Sri Venkateswara Swamy temple in Seetampeta of Manyam district, Panchagavyadhivasam was observed by the Ritwiks on Monday. 

 

Speaking on the occasion, the Upadrasta of the event Sri Mohana Rangacharyulu said, usually the sculptors will carve the deities from the stone giving it a shape. After the deity is being prepared, to provide a relief to the deity, “Bimbasuddhi” will be carried out and as part of it Panchagavyadhivasam with the products of desi cow which includes ghee, milk, curd, dung and urine was carried out as per Agama recited the relevant Mantras. Later Panchagavya Prasana, Vastu Homam, Akalmasha Prayaschitta Homa, Rakshabandhanam were performed. In the evening Agni Pratistha, Kumbha Sthapana, Kumbharadhana and Visesha Homams will be observed”, he added.

 

Kankanabhattar Sri Seshacharyulu, Sri Gunabhushan Reddy, Sri Venkataiah, Sri Siva Prasad, EE Sri Sudhakar, AEO Sri Ramesh and other officials were present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సీతంపేటలో శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం

సీతంపేట, 2023, మే 01: పార్వతీపురం మన్యం జిల్లా  సీతంపేటలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం నిర్వహించారు. మే 4న మహాసంప్రోక్షణ, శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా కార్యక్రమ ఉపద్రష్ట, టీటీడీ వైఖానస ఆగమసలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు మాట్లాడుతూ సోమవారం ఉదయం బింబశుద్ధి కోసం పంచగవ్యాధివాసం నిర్వహించినట్టు తెలిపారు. ముడిశిలను శిల్పులు చాకచక్యంగా స్వామి, అమ్మవార్ల విగ్రహాలుగా మలుస్తారని, ఈ క్రమంలో సుత్తి, ఉలి దెబ్బలకు వేదనకు గురయ్యే విగ్రహాలకు ఉపశమనం కలిగించామని చెప్పారు. ఇందుకోసం పంచగవ్యాలైన పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రంతో అభిషేకం చేశామని వివరించారు. అనంతరం పంచగవ్యప్రాసన, వాస్తు హోమం, అకల్మష ప్రాయశ్చిత్త హోమం, రక్షాబంధనం నిర్వహించామని తెలిపారు. సాయంత్రం అగ్ని ప్రతిష్ట, కుంభ స్థాపన, కుంభారాధన, విశేష హోమాలు నిర్వహిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కంకణభట్టార్ శ్రీ శేషాచార్యులు, డెప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్ రెడ్డి, శ్రీ వెంకటయ్య, శ్రీ శివప్రసాద్, ఈఈ శ్రీ సుధాకర్, ఏఈఓ శ్రీ రమేష్, డెప్యూటీ ఈఈ లు
శ్రీ ఆనందరావు, శ్రీ నాగరాజు, జే ఈ శ్రీ రవికుమార్, సూపరింటెండెంట్ శ్రీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.