HI FI PA SYSTEM ADDS THE FLAVOUR TO BHAJAN TROUPES_ కళాబృందాలకు స్పీకర్లు, యాంప్లిఫైయర్‌ అందించిన టిటిడి

Tiruchanur, 21 November 2017: For the first time in the history of Sri Padmavathi Devi Brahmotsavams at Tiruchanoor, TTD has procured Hi-Fi Portable Amplifier System to have uniform sound and acoustics of the performances by various Bhajan troupes.

Under the instructions of TTD EO Sri Anil Kumar Singhal, TTD Chief Engineer Sri Chandrasekhar Reddy procured 25 PA systems which have Mike, Bluetooth, Pen Drive options with in built speakers and amplifiers. To give an aesthetic traditional look, the Engineering wing also designed a wooden frame with Shankha-Chakra-Namalu which stood as a special attraction during the brahmotsavam fete.

The artistes also expressed immense happiness over the decision of TTD to supply PA systems for all the tropes to maintain uniformity and clarity in sound. The PA system is user friendly with 50 watts capacity.

TTD EO also complimented the unique performances of Bhajan troupes and the PA system. He instructed the concerned departments to select expert dance forms from various states and make use of the advanced PA systems for better output of performances by artistes even for annual brahmotsavams at Tirumala next year.

Apart from this the Electrical wing of TTD under the supervision of SE Electrical Sri Venkatewarulu also set up nearly 20 LED screens at different vital points inside and outside Tiruchanoor temple for better view of sevas and vahana sevas by denizens and devotees.

The functioning of PA Systems and LED screens are being supervised by DE Sri Ravishankar Reddy and DyEE Radio and Broadcasting Smt Rama Devi.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వ్యాసం – 8

కళాబృందాలకు స్పీకర్లు, యాంప్లిఫైయర్‌ అందించిన టిటిడి

తిరుపతి, 2017 నవంబరు 21: సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో మొదటిసారిగా భజన బృందాలకు టిటిడి మైక్‌సెట్‌, స్పీకర్లను అందించింది. రాబోవు రోజులలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, ఇతర టిటిడి అనుబంధ ఆలయాలలో జరిగే ఉత్సవాలలో పాల్గొనే కళా బృందాలకు వీటిని అందివ్వనున్నారు.

టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, కళా బృందాలకు స్వామి, అమ్మవార్ల వాహనసేవలలో ప్రదర్శనలిచ్చేందుకు అవకాశం కల్పిస్తున్న విషయం విధితమే. ఇందులో భాగంగా కళాకారుల సౌలభ్యం కొరకు టిటిడి శాశ్వత ప్రాతిపదికన 25 పోర్టబుల్‌ యాంప్లిఫైయర్‌ అడ్రస్‌ సిస్టమ్‌ను కొనుగోలు చేసింది. వాటిని మొదటి సారిగా శ్రీ పద్మావతిఅమ్మవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్న కళాబృందాలకు అందజేసింది.

ఇందులో మైకు, యాంప్లిఫైయర్‌, బ్లూటూత్‌, పెన్‌ డ్రైవ్‌, 50 వాట్‌ల ఇన్‌బెల్టు స్పీకర్లు కలిగివుంటాయి. వీటిని నాలుగు మాడ వీధులలో కళా బృందాలు తమ ప్రదర్శనలో సంగీతం వినేందుకు వీలుగా సంచార మ్యూజిక్‌ సిస్టంను వినియోగిస్తారు. ఇందులో 50 వాట్‌ల స్పీకర్‌ల వల్ల పాటలు, సంగీతం వినటానికి అహ్లాదకరంగా వుంటుంది. ఇవి సాంప్రదాయబద్ధంగా కనిపించేలా శ్రీవారి తిరునామం, శంఖు చక్రాలు, తోరణాల స్టిక్కర్లుతో అలంకరించారు.

అంతేగాక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలు, వాహనసేవలను ప్రత్యక్షంగా వీక్షించలేని భక్తుల సౌలభ్యం కొరకు 20 ఎల్‌ఇడి స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయం, నాలుగుమాడ వీధులలో, గంగుండ్ర మండపం, పద్మసరోవరం (పుష్కరిణి), తిరుచానూరులోని భక్తుల రద్దీ ప్రాంతాలలో, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం వసతి సమూదాయాలలో ఎల్‌ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అంతేగాక భక్తులలో భక్తి భావాన్ని మరింత పెంచేందుకు తిరుచానూరు నుండి తిరుపతి వరకు స్పీకర్లు, హరన్లు ఏర్పాటు చేసి అమ్మవారి ఆలయంలో జరిగే కార్యక్రమాలను భక్తులకు అందిస్తుంది. వీటిని టిటిడి రెేడియో అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో సందర్భంగా తిరుచానూరు ఆస్థాన మండపం, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, మహతి కళాక్షేత్రం, రామచంద్ర పుష్కరిణి వద్ద ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విధితమే. ఇందుకు అవసరమైన మైకులు, స్పీకర్లు, యాంప్లిఫైయర్లు ఏర్పాటు చేసి భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది.

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆధ్వర్యంలో, సిఇ చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలో, రెేడియో అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం డిఇ రవిశంకర్‌రెడ్డి, డెప్యూటీ ఈఈ శ్రీమతి రమాదేవి పర్యవేక్షిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.