TTD PUBLICATIONS SET FOR A WIDER REACH-TIRUPATI JEO_ భక్తులకు మరింత చేరువగా టిటిడి ప్రచురణలు -టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 21 November 2017: To ensure the publications of TTD reach wide range of devotees spread across the country, Tirupati JEO Sri P Bhaskar has called upon the officials concerned for a complete makeover of TTD publications.

A review meeting was held in the chambers of Tirupati JEO on Tuesday. Speaking on this occasion, the JEO said, different projects of TTD should come out with an action plan on print, publish and dispatch mechanism.

“Our publications should be sent to various mutts, renowned libraries, versatile spiritual persons to have a wider reach”, he asserted. He also suggested to go for tenders for agencies to sell the TTD publications.

FACAO Sri Balaji, all project officers were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

భక్తులకు మరింత చేరువగా టిటిడి ప్రచురణలు -టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2017 నవంబరు 21: ప్రఖ్యాత ధార్మిక సంస్థ అయిన టిటిడి ముద్రించే ఆధ్యాత్మిక పుస్తకాలను భక్తులకు మరింత చేరువ చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయాలని తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని జెఈవో కార్యాలయంలో టిటిడి ప్రచురణల పరిరక్షణ, ప్రచారంపై వివిధ ప్రాజెక్టుల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి ప్రచురణల పరిరక్షణలో భాగంగా ఆయా ప్రాజెక్టుల అధికారులు ప్రచురించే పుస్తకాల ప్రధాన అంశాల ఆధారంగా కవర్‌పేజి రూపొందించి, ఎన్ని పుస్తకాలు ముద్రించాలి, ఎలా పంపిణీ చేయాలి అనే విషయాలను సమగ్రంగా పొందుపర్చాలన్నారు. ముద్రించిన ప్రచురణలను మఠాలు, పీఠాధిపతులు, లైబ్రరిలకు, ప్రముఖ వ్యక్తులకు, సంస్థలకు పంపేందుకు ప్రణాళికలు ముందే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రముఖ పండుగలు, టిటిడి నిర్వహించే ధార్మిక కార్యక్రమాలకు సంబంధించి ముద్రించే పుస్తకాలను హిందూ ధర్మ ప్రచార పరిషత్‌, దాస సాహిత్య ప్రాజెక్టుల ద్వారా భక్తులకు పంపిణీ చేయాలన్నారు.

అదేవిధంగా టిటిడి ప్రచురణలకు మరింత ప్రచారం కల్పించాలని, భక్తులు పుస్తకాలను కొనుగొలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. పుస్తకాలు ముద్రించక ముందే ఎన్ని పుస్తకాలు ముద్రించాలి, ఎవరెవరికి పంపాలి, విక్రయానికి ఎన్ని పుస్తకాలు ఉంచాలి వంటి సమగ్ర సమాచారం తెలపాలని అధికారులను ఆదేశించారు. పుస్తకాల కవర్‌పేజి మరింత ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించాలని, పేపర్‌ నాణ్యతను ముందే నిర్ణయించాలన్నారు. ఇందుకు సంబంధించి నిపుణుల నుండి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు.

టిటిడి ప్రచురణల విక్రయ విభాగంలో ఉన్న పుస్తకాలను భక్తులకు అందుబాటులోనికి తీసుకురావడానికి టెండర్‌ల ద్వారా ఏజెన్సీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. తద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలలో టిటిడి పుస్తకాలను భక్తులకు అందుబాటులో తీసుకురావడానికి వీలవుతందని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎ అండ్‌ సిఎవో శ్రీ బాలాజి, ప్రాజెక్టుల అధికారులు శ్రీఆంజనేయులు, శ్రీసముద్రాల లక్ష్మణయ్య, శ్రీ మేడసాని మోహన్‌, ఆచార్య కె.జె.కృష్ణమూర్తి, శ్రీ ఆనంద తీర్థచార్యులు, శ్రీ చొక్కలింగం, చీఫ్‌ఎడిటర్‌ శ్రీ రాధారమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.