HIGH STANDARDS OF SANITATION IN TIRUMALA IS TOP MOST PRIORITY – TTD EO _ తిరుమలలో అత్యున్నత ప్రమాణాలతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి : టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు

COMMITTEE WITH SENIOR OFFICERS ON SANITATION

TIRUMALA, 01 JULY 2024: Maintaining the highest standards of cleanliness of the entire premises of Tirumala is one of the top most priorities of TTD, asserted TTD EO Sri J Syamala Rao.

The EO held a detailed review meeting with the Health Department of TTD along with JEOs Smt Goutami and Sri Veerabrahmam at Gokulam Rest House in Tirumala on Monday.

He discussed on various issues related to manpower, sanitary materials, staff performance, mechanisation and many others.

Earlier the Sanitary Inspectors informed the EO about various shortcomings which included…

Deficiency in performance due  insufficient manpower in the extended work area. 

Improper supply of sanitary materials on time and supply of sub standard cleaning materials by the Agencies entrusted with sanitation contract.

After listening carefully to the various issues, the EO directed both the JEOs to give stern warning to the contractor and give three days time for improving cleaning measures in Tirumala by providing sufficient manpower and material supply as per norms.

He also ordered JEO to Constitute a Committee with Senior Officers to inspect randomly after three days and give a detailed report on sanitation to take further course of action on the Sanitation Agencies.

“Tirumala, besides being most sought after pilgrim place in the world, also holds the reputation for its clean environs inspite of tens of thousands of footfall everyday. If Tirumala precincts are not kept clean and tidy, it reflects bad image to the institution which cannot be tolerated. All the issues and requirements needed to strengthen the department shall be taken care of by the management but the Health wing officials should ensure effective supervision especially in the areas where pilgrim interface is more”, he asserted.

The EO also asked the officials concerned to assess the mapping of area wise and shift wise requirement of workers required in Tirumala and submit the list to address the manpower issues.

FACAO Sri Balaji, SE 2 Sri Jagadeeshwar Reddy, DyEO Health Sri Harikrishna, Health Officer Dr Sridevi, EE FMS Sri Srinivasa Rao, Sanitary Inspectors and other staff from Health Department were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో అత్యున్నత ప్రమాణాలతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి : టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు

•⁠ ⁠పారిశుధ్యంపై సీనియర్ అధికారులతో కమిటీ

తిరుమల, 2024 జూలై 01: ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసి వేలాదిమంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యున్నత ప్రమాణాలతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆదేశించారు.

తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో సోమవారం టీటీడీ జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, శానిటరీ మెటీరియల్స్, సిబ్బంది పనితీరు, యాంత్రీకరణ తదితర అనేక అంశాలపై ఆయన చర్చించారు.

అంతకుముందు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పలు సమస్యలను ఈఓకు తెలియజేసారు.

భక్తుల క్యూలు విస్తరించిన ప్రాంతంలో తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల పారిశుద్ధ్య పనితీరులో లోపం, సమయానికి శానిటరీ మెటీరియల్స్ ను ఏజెన్సీ లు సరిగ్గా సరఫరా చేయకపోవడం మరియు నాణ్యత లేని క్లీనింగ్ సామాన్ల సరఫరాచేయడం తదితర అంశాలను తెలిపారు.

పలు సమస్యలను సావధానంగా విన్న ఈఓ, కాంట్రాక్టర్‌లను కఠినంగా హెచ్చరించాలని, నిబంధనల ప్రకారం సరిపడా సిబ్బంది, మెటీరియల్‌ సరఫరా చేసి తిరుమలలో పరిశుభ్రత చర్యలను మెరుగుపరిచేందుకు మూడు రోజుల సమయం ఇవ్వాలని జేఈఓలను ఆదేశించారు.

మూడు రోజుల తర్వాత ఆకస్మికంగా తనిఖీలు చేసేందుకు సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి, తదుపరి చర్యలు తీసుకోవడానికి పారిశుద్ధ్యం పై సవివరమైన నివేదిక ఇవ్వాలని ఆయన జేఈవోలను ఆదేశించారు.

తిరుమల కు ప్రపంచ ప్రసిద్ధ హైందవ ఆధ్యాత్మిక దివ్య క్షేత్రం గానే కాకుండా ప్రతిరోజు వేల మంది భక్తులు విచ్చేసినా పరిశుభ్రతకు కూడా ఎంతో ప్రాశస్త్యం ఉందన్నారు. తిరుమల, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే భక్తుల్లో సంస్థకు చెడ్డపేరు వస్తుందన్నారు.

ఆరోగ్య విభాగం బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని అవసరాలను యాజమాన్యం చూసుకుంటుందన్నారు. అయితే సిబ్బంది యావత్తు పరిసరాల పరిశుభ్రత విషయం లో ముఖ్యంగా యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సమర్థవంతంగా పనిచేయాలని,పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.

తిరుమలలో ప్రాంతాల వారీగా, షిఫ్ట్‌ల వారీగా అవసరమయ్యే కార్మికుల జాబితా, అంచనా వేసి, సిబ్బంది సమస్యల పరిష్కారానికి సమగ్ర నివేదిక సమర్పించాలని ఈఓ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఎఫ్ఏ అండ్ సిఏఓ శ్రీ బాలాజీ, ఎస్ఈ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈవో (హెల్త్) శ్రీ హరికృష్ణ, ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీదేవి, ఈఈ ఎఫ్ఎంఎస్ శ్రీ శ్రీనివాసరావు, ఆరోగ్య శాఖ శానిటరీ ఇన్‌స్పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.