HIGHESTNUMBER OF DEVOTEES HAVE DARSHAN THROUGH SRIVANI TRUST _ శ్రీవాణి ట్రస్టు ద్వారా 346 మందికి బ్రేక్ దర్శనం
Tirumala, 8 December 2019: The newly launched innovative Trust, Sri Venkateswara Alaya Nirmana (SRIVANI) by TTD has been receiving overwhelming response from the devotees.
On Sunday 346 devotees had darshan of Lord Venkateswara through SRIVANI Trust taking the figure as highest so far since its inception after being linked to protocol darshan from October 21 onwards and opening up online quota from November 4 onwards.
When 147 devotees donated to the Trust in off-line, 199 devotees booked in on-line taking the total to 346.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీవాణి ట్రస్టు ద్వారా 346 మందికి బ్రేక్ దర్శనం
తిరుమల, 08 డిసెంబరు 2019 ; టిటిడి నూతనంగా ప్రారంభించిన శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు(శ్రీవాణి)కు భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది.
ఈ ట్రస్టుకు విరాళాలందించడం ద్వారా ఆదివారం అధిక సంఖ్యలో 346 మంది బ్రేక్ దర్శనం చేసుకోవడం విశేషం. ఇప్పటివరకు దర్శించుకున్న వారిలో ఈ సంఖ్యే అధికం. అక్టోబరు 21 నుండి ఈ ట్రస్టును బ్రేక్ దర్శనాలకు అనుసంధానం చేశారు. నవంబరు 4వ తేదీ నుండి ఆన్‌లైన్ కోటాను ప్రారంభించారు. ఆదివారం దర్శించుకున్న వారిలో ఆఫ్‌లైన్‌లో విరాళం ఇచ్చినవారు 147 మంది, ఆన్‌లైన్‌లో విరాళమిచ్చిన వారు 199 మంది ఉన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.