HIGHLIGHTS OF ACTIVITIES DURING SRIVARI ANNUAL BRAHMOTSAVAM FROM SEPTEMBER 18-25(8 days) _ బ్రహ్మోత్సవాల్లో సెప్టెంబరు 18 నుండి 25వ తేదీ వరకు(8 రోజులు) నమోదైన వివరాలు
Tirumala, 26 September 2023: The following are highlights during Srivari annual Brahmotsavam from September 18-25(8 days)
@ The Honourable CM of AP Sri YS Jaganmohan Reddy presented pattu vastrams to Srivari temple on September 18 on behalf of state government as a tradition.
@CM also inaugurated the 7 km long ₹650.5 crore Srinivasa Sethu expressway and ₹ 37.80 crore Hostel blocks of SV Arts college and also launched the distribution of house sites to 3518 TTD employees at Padiredu village of Vadamalapeta Mandal.
CM also inaugurated two rest houses – Vakulamata Nilayam rest house (₹20 crore) and Sri Rachana rest house (₹11.50 crore) at Tirumala.
Srivari temple
5.47 pilgrims lakh had srivari darshan
During Garuda Vahana Seva 72,650 had srivari Darshan and over two lakh witnessed Garuda Vahana Seva.
8 lakh Laddu buffer stock kept and sold 30.22 lakh laddus
Srivari Hundi collections ₹24.22 crore
Vigilance and security wing :
2770 CCTVs, 5000 persons of TTD vigilance and police in bandobust duty.
6000 child tags tied
Kalyana Katta :
About 2.07 lakh devotees tonsured
1150 barbers engaged in 11 Kalyana Katta for tonsuring
Reception
80.10% occupancy rate achieved.
Anna Prasadam
16.28 lakhs given meals and tiffin On Garuda Seva day 4.81 lakhs Devotees given Anna Prasadam and 3.37 given tea, coffee,milk, 2.50 lakhs of buttermilk packets
Medical
40 doctors, 35 paramedics and 13 ambulances deployed
31 thousand devotees given medical services
Health wing
For sanitation and garbage cleaning in Tirumala 3000 were deployed and additionally 774 on Garuda Seva day.
Engineering wing
Gallery arranged on Mada streets for 2 lakh devotees to watch Vahana Sevas
Parking lots organised at Tirumala additionally for 9000 vehicles besides queue lines for chakra Snanam.
368 lakh gallons of water utilised during Brahmotsavam
Electrical cutouts of deities, arches and illumination installed in Tirumala
20 LED screens displayed
TTD Hindu Dharma projects
Cultural teams from 12 states with 3710 Artists belonging to 152 teams participated
Garden department
Flower decorations were organised at Srivari temple, all junctions, rest houses besides Flower exhibition with 45 Tons of flowers. 3 lakhs cut flowers 75000 Seasonal flowers.
Public relations department
Media centre set up at Ram Bagicha -2 rest house and photo exhibition at Kalyana vedika.
Services by 3342 Srivari Sevakulu from all over the country
Publications department
Tirupati and Tirumala sales counters set up for sale of TTD publications ₹ 74.59 lakhs sold.
Release of 10 spiritual books in Telugu, Tamil, Hindi, English Sanskrit languages during Vahana Sevas.
IT WING
* For the first time vehicle pass management system deployed to issue passes to vehicles coming to Tirupati on Garuda Seva day via Kukkaladoddi, Karakambadi, Vadamalapeta, Itepalli, Rangampeta, R.Mallavaram
* Brahmotsavam visual coverage rolled out through Social media sites enabling worldwide visibility.
* All 5000 policemen on deputation for Brahmotsavam were issued duty
SVBC
The SVBC channel broadcasts in Telugu, Tamil, Kannada and Hindi languages 9 hours live Daily besides YouTube, TTD website, Facebook and Twitter channels
Commentary by eminent pundits in Telugu, Kannada, Tamil and Hindi for Vahana Sevas on Mada streets and Snapana Tirumanjanam in Srivari temple.
APSRTC
APSRTC operated 13532 trips from Tirupati to Tirumala and facilitated 3.25 lakh devotees daily . Similarly the Tirumala to Tirupati in 12996 trips 3.69 lakh devotees
On Garuda Vahana day APSRTC operated 2491 Trips to Tirumala and carried 73460 passengers. and 2400 trips to Tirupati and carried 56491 devotees.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
బ్రహ్మోత్సవాల్లో సెప్టెంబరు 18 నుండి 25వ తేదీ వరకు(8 రోజులు) నమోదైన వివరాలు
తిరుమల, 2023 సెప్టెంబరు 26: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో సెప్టెంబరు 18 నుండి 25వ తేదీ వరకు 8 రోజుల పాటు నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి.
– ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి సెప్టెంబరు 18వ తేదీన శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
– అదేవిధంగా తిరుపతిలో రూ.650.50 కోట్లతో 7 కిలోమీటర్ల మేర నిర్మించిన శ్రీనివాససేతు ఫ్లైఓవర్ ను, శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో రూ.37.80 కోట్లతో టీటీడీ నిర్మించిన రెండు హాస్టల్ బ్లాకులను ప్రారంభించారు.
– వీటితో పాటు వడమాలపేట మండలం పాదిరేడు గ్రామ సమీపంలో 3,518 మంది టీటీడీ ఉద్యోగులకు ఇంటిస్థల పట్టాల పంపిణీని ప్రారంభించారు.
– తిరుమలలో దాతల సహకారంతో రూ.20 కోట్లతో నిర్మించిన వకుళామాత నిలయం విశ్రాంతి గృహాన్ని, రూ.11.50 కోట్లతో నిర్మించిన శ్రీ రచన విశ్రాంతి గృహాన్ని ముఖ్యమంత్రివర్యులు ప్రారంభించారు.
శ్రీవారి ఆలయం :
– 5.47 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
– గరుడసేవనాడు 72,650 మంది దర్శించుకున్నారు. కాగా, గరుడసేవలో దాదాపు 2 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు.
– రోజుకు 8 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్.
– విక్రయించిన మొత్తం లడ్డూలు 30.22 లక్షలు.
– హుండీ కానుకలు రూ.24.22 కోట్లు.
నిఘా మరియు భద్రతా విభాగం :
– 2,770 సిసిటివిలు, 5 వేల మంది టిటిడి విజిలెన్స్, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
– చిన్నపిల్లలు తప్పిపోకుండా 6 వేల ఛైల్డ్ ట్యాగ్‌లు కట్టారు.
కల్యాణకట్ట :
– తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 2.07 లక్షలు.
– 1150 మంది క్షురకులు 11 కల్యాణకట్టల్లో భక్తులకు తలనీలాలు తీయడం జరిగింది.
రిసెప్షన్ :
– గదుల కేటాయింపు ద్వారా వచ్చిన ఆదాయం – రూ.1.69 కోట్లు
– బ్రహ్మోత్సవాలలో గదుల ఆక్యుపెన్సీ – 80 శాతం
అన్నప్రసాదం :
– బ్రహ్మోత్సవాల 8 రోజుల్లో 16.28 లక్షల భోజనాలు, అల్పాహారం అందించడమైనది.
– గరుడసేవనాడు 4.81 లక్షల మందికి అన్నప్రసాదాలు, అల్పాహారం, 3.37 లక్షల మందికి టి, కాఫి, పాలు, 2.50 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు అందించడం జరిగింది.
వైద్యం :
– 40 మంది డాక్టర్లు, 35 మంది పారామెడికల్ సిబ్బందిని, 13 అంబులెన్సులు వినియోగించడమైనది.
– 31 వేల మందికి పైగా భక్తులకు వైద్యసేవలు.
ఆరోగ్య విభాగం :
– తిరుమలలో మెరుగైన పారిశుద్ధ్యం కోసం 3 వేల మంది సిబ్బంది, గరుడ సేవ రోజు అదనంగా 774 మంది సిబ్బంది ఏర్పాటు.
ఇంజనీరింగ్ విభాగం :
– దాదాపు 2 లక్షల మంది భక్తులు కూర్చొని వాహనసేవలు వీక్షించేందుకు వీలుగా గ్యాలరీలు ఏర్పాటు.
– తిరుమలలో 9 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్, చక్రస్నానం కోసం పుష్కరిణిలో ప్రత్యేక క్యూలైన్లు.
– బ్రహ్మోత్సవాల్లో 368 లక్షల గ్యాలన్ల నీటి వినియోగం.
– శ్రీవారిమెట్టు, అలిపిరి వద్ద కార్లు, ద్విచక్రవాహనాలకు పార్కింగ్ వసతి.
– తిరుమలలో పలు ప్రాంతాల్లో దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లతోపాటు గరుడ సేవనాడు 20 పెద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు.
టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టులు :
– హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాళ్, రాజస్థాన్ కలిపి 12 రాష్ట్రాల నుండి వచ్చిన 152 కళాబృందాల్లో 3,710 మంది కళాకారులు 52 కళారూపాలను ప్రదర్శించారు. వాహన సేవలతో పాటు తిరుమల, తిరుపతిలో ప్రదర్శించిన కళాకృతులు విశేషంగా అకట్టుకున్నాయి. భక్తులు ఎంతో సంతోషించారు.
ఉద్యానవన విభాగం :
– శ్రీవారి ఆలయంతో పాటు పలు కూడళ్ళు, అతిథి గృహాల వద్ద శోభాయమానంగా పుష్పాల అలంకరణలు, పుష్పప్రదర్శన. 45 టన్నులు పుష్పాలు, 3 లక్షల కట్ ఫ్లవర్స్, 75 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగం.
ప్రజాసంబంధాల విభాగం :
– రాంభగీచా-2లో మీడియా సెంటర్, కల్యాణవేదిక వద్ద ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు.
– దేశం నలుమూలల నుండి విచ్చేసిన 3,342 మంది శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు.
ప్రచురణల విభాగం :
– తిరుపతి, తిరుమలలో పుస్తక విక్రయశాలలు ఏర్పాటు. ప్రచురణల విక్రయం : రూ.74.59 లక్షలు. వాహనసేవల్లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు, సంస్కృత భాషల్లో 10 ఆధ్యాత్మిక గ్రంథాలు ఆవిష్కరణ.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ :
– ఎస్వీబీసీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఛానళ్లలో రోజుకు 9 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారాలు. యుట్యూబ్, ఎస్వీబీసీ యాప్, టీటీడీ వెబ్‌సైట్ ద్వారా కూడా భక్తులకు ప్రసారాలు అందించాం.
– ప్రముఖ పండితులతో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వ్యాఖ్యానాలు.
ఐటీ విభాగం:
– తొలిసారిగా గరుడ సేవ నాడు కుక్కలదొడ్డి, వడమాలపేట, ఐతేపల్లి, రంగంపేట, కరకంబాడి, ఆర్.మల్లవరం ప్రాంతాల్లో వెహికిల్ పాస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా తిరుపతికి వచ్చే వాహనాలకు పాసులు మంజూరు చేయడం జరిగింది. దీని ద్వారా తిరుమలలో వాహనాల రద్దీ పెరిగినప్పుడు తిరుపతిలోనే పార్కింగ్ సౌకర్యం కల్పించడం జరిగింది.
– బ్రహ్మోత్సవాల వాహన సేవలను సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వాహన సేవలను వీక్షించి తరించారు.
ఎపిఎస్‌ఆర్‌టిసి :
– ఎపిఎస్‌ఆర్‌టిసి తిరుపతి నుంచి తిరుమలకు 13,352 ట్రిప్పుల్లో 3.25 లక్షల మంది భక్తులను చేరవేశాయి. తిరుమల నుంచి తిరుపతికి 12,977 ట్రిప్పుల్లో 3.69 లక్షల మంది భక్తులను చేరవేశాయి.
– గరుడసేవనాడు ఆర్‌టిసి బస్సులు తిరుపతి నుంచి తిరుమలకు 2491 ట్రిప్పుల్లో 73,460 మంది భక్తులను చేరవేశాయి. తిరుమల నుంచి తిరుపతికి 2400 ట్రిప్పుల్లో 56,491 మంది భక్తులను చేరవేశాయి.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.