PAVITRAMALAS ADORNED _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
TIRUPATI, 26 SEPTEMBER 2023: As part of the annual Pavitrotsavams in Sri Govindaraja Swamy temple in Tirupati on Tuesday, Pavitramalas were decked to deities.
In the morning Snapana Tirumanjanam was observed.
Both the Tirumala pontiffs, DyEO Smt Shanti, AEO Sri Munikrishna Reddy and others were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
తిరుపతి, 2023 సెప్టెంబరు 26: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు.
ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం నిర్వహించారు.
అనంతరం మూలవర్లకు, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, పరివార దేవతలకు విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి, శ్రీ మఠం ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఆలయ ప్రధానార్చకులు శ్రీ ఎపి.శ్రీనివాస దీక్షితులు, ఏఈవో శ్రీ ముని క్రిష్ణారెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ నారాయణ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.