HINDI VERSION WEBSITE SOON_ టిటిడి వెబ్‌సైట్‌ తమిళ వర్షన్

Tirumala, 1 December 2017: After successfully lunching Telugu, Kannada, Tamil version websites, TTD will soon launch its Hindi version also for the sake of the pilgrims, said TTD EO Sri Anil Kumar Singhal.

Before taking calls from pilgrims across the country, during the “Dial your EO” program, TTD EO informed the pilgrims about various developmental activities taken up by TTD in the last one month.

HUGE TURN OUT OF PILGRIMS FOR TIRUCHANOOR BRAHMOTSAVAMS

The EO thanked the pilgrim devotees for turning out in large numbers for Tiruchanoor Brahmotsavams which was observed from November 15-23. I compliment our employees, Srivari Seva volunteers, police, local bodies and locals for making the religious event a grand success”, he maintained.

EXCELLENT SHOW BY BHAJAN TEAMS AND ARTISTES

The EO also complimented the performances by Bhajan troupes and various art forms hailing from AP, Telengana, Tamilnadu and Karnataka who performed during Tiruchanoor Brahmotsavams. “We want to showcase new art forms during Tirumala Brahmotsavams next year”, he added.

ELABORATE ARRANGEMENTS FOR V- DAY

For the ensuing Vaikuntha Ekadasi and Dwadasi on December 28 and 29 respectively, we are making elaborate arrangements to ensure that pilgrims had a hassle free darshan, the EO said.

10K ODD TICKETS IN ONLINE

About 53,428 tickets are pertaining to various ‘arjitha sevas’ performed at the Tirumala temple of Lord Venkateswara for the month of March 2018 are released in online quota.

Among these tickets, the tickets in electronic dip are 10,843 including Suprabhatam (8,103) Thomala and Archana (130 each) Astadalam (180) Nijapada darshanam (2,300)

Other sevas in general category are 42, 585 Visesha puja (1,500), Kalyanotsavam (10,125) Unjal seva (2,700) Arjitha Brahmotsavams (5,590) Vasanthotsavams (10,320) Sahasra deepalankara seva (12,825)

SLOT-WISE SARVA DARSHAN

This month we will have a trial run of slot wise sarva darshan for five to six days. Based on the feedback and observations from the pilgrims we will implement the system in two or three months in a full fledged manner. The aim is to reduce waiting hours to pilgrims even in free darshan.

TTD CALENDARS THROUGH FLIPKART

The TTD Calendars and Diaries 2018 will be made available to book online in TTD website, ttdsevaonline.com as well in Flipkart portal. The diaries and calendars will be delivered to pilgrims through postal department and Flipkart including additional delivery charges.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

డిసెంబరు 01, తిరుమల 2017: తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడారు.

– గతేడాది నవంబరులో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 20,72,591 కాగా, ఈ ఏడాది నవంబరులో 20,55,953 మంది దర్శించుకున్నారు.

– గతేడాది నవంబరులో 79,34,652 లడ్డూలను భక్తులకు అందించగా, ఈ ఏడాది 83,15,373 లడ్డూలను అందించడమైనది.

– గతేడాది నవంబరులో 33,91,092 మంది భక్తులకు అన్నప్రసాదాలు అందించగా, ఈ ఏడాది 41,18,363 మంది భక్తులు స్వీకరించారు.

– గతేడాది నవంబరులో 22,11,400 మంది భక్తులకు అల్పాహారం, పాలు, కాఫీ, టి అందించగా, ఈ ఏడాది 28,65,206 మంది భక్తులు స్వీకరించారు.

– గతేడాది నవంబరులో 8,87,968 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, ఈ ఏడాది నవంబరులో 8,68,866 మంది భక్తులు సమర్పించారు.

– గతేడాది నవంబరులో హుండీ ఆదాయం రూ.91.16 కోట్లు కాగా, ఈ ఏడాది నవంబరులో రూ.82.38 కోట్లు లభించింది.

– గతేడాది నవంబరులో గదుల ఆక్యుపెన్సీ 105 శాతం కాగా, ఈ ఏడాది నవంబరులో 106గా నమోదైంది.

వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు : డిసెంబరు 29న వైకుంఠ ఏకాదశి, 30న వైకుంఠ ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నాం.

– క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందించేందుకు చర్యలు చేపట్టాం.

ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో బుక్‌ చేసుకున్న భక్తులు : నవంబరు నెలలో విడుదల చేసిన ఆర్జితసేవలకు ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో సేవలు పొందిన భక్తుల వివరాలు ఇలా ఉన్నాయి.

– మొత్తం 1,16,071 మంది భక్తులు ఆన్‌లైన్‌ లక్కీడిప్‌లో నమోదు చేసుకోగా 10,019 మందికి సేవలు మంజూరయ్యాయి.

మొదటిసారి 39,322 మంది ప్రయత్నించగా 21.95 %, రెండోసారి 24,954 మంది ప్రయత్నించగా 22.20 %, మూడోసారి 16,509 మంది ప్రయత్నించగా 17.11 % , నాలుగోసారి 13,815 మంది ప్రయత్నించగా 15.27 % , ఐదోసారి 11,868 మంది ప్రయత్నించగా 11.84 %, ఆరోసారి 9,603 మంది భక్తులు ప్రయత్నించగా 10.64% మందికి సేవాటికెట్లు లభ్యమయ్యాయి.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూెత్సవాలు విజయవంతం : తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మూెత్సవాలను నవంబరు 15 నుంచి 23వ తేదీ వరకు విజయవంతంగా నిర్వహించాం. వేలాది మంది భక్తులు విచ్చేశారు.

– ఈ బ్రహ్ముెత్సవాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి నైపుణ్యం గల కళాకారులు విచ్చేసి చక్కటి కళాప్రదర్శనలిచ్చారు.

– ఇదేవిధంగా, వచ్చే ఏడాది శ్రీవారి బ్రహ్మూెత్సవాల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన నైపుణ్యం గల కళాబృందాలను ఆహ్వానించి భక్తులను ఆకట్టుకునేలా ప్రదర్శనలిచ్చేందుకు చర్యలు చేపట్టాం.

సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్‌ : సర్వదర్శనం భక్తులు అధిక సమయం క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండా చూసేందుకు డిసెంబరు రెండో వారం నుంచి ప్రయోగాత్మకంగా టైమ్‌స్లాట్‌ విధానాన్ని అమలుచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

– మొదటి విడతగా తిరుమలలోని 14 ప్రాంతాల్లో 107 సర్వదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లు ఏర్పాటుచేస్తున్నాం.

టిటిడి డైరీలు, క్యాలెండర్లు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే అవకాశం :

– 2018వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను డిసెంబరు 7వ తేదీ నుంచి ttdsevaonline.com ద్వారా భక్తులు బుక్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న భక్తులకు తపాలా శాఖ ద్వారా అందజేస్తాం. అదేవిధంగా, ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో టిటిడి డైరీలు, క్యాలెండర్లు పొందేందుకు వీలు కల్పిస్తున్నాం. ఇందుకుగాను భక్తులు అదనంగా తపాలా శాఖ, ఫ్లిప్‌కార్ట్‌ వారికి డెలివరీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

టిటిడి వెబ్‌సైట్‌ తమిళ వర్షన్‌ :

– ttdsevaonline.com వెబ్‌సైట్‌ తమిళ వర్షన్‌ను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చాం. త్వరలోనే హిందీ వర్షన్‌ను ప్రారంభిస్తాం.

భక్తులకు అందుబాటులో ఎఫ్‌ఎంఎస్‌ హెల్ప్‌లైన్‌ :

– తిరుమలలోని వసతిగృహాల్లో భక్తులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం ఇటీవల ఎఫ్‌ఎంఎస్‌ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేశాం. టోల్‌ ఫ్రీ నంబరు – 1800425111111.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.