డిసెంబరు 2న శ్రీకపిలేశ్వరాలయంలో కృత్తిక దీపోత్సవం
డిసెంబరు 2న శ్రీకపిలేశ్వరాలయంలో కృత్తిక దీపోత్సవం
తిరుపతి, 2017, డిసెెంబరు 01: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాయంలో డిసెంబరు 2వ తేదీ శనివారం సాయంత్రం కృత్తిక దీపోత్సవం ఘనంగా నిర్వహంచనున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం 4.00 గంటల నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయం 6.00 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6.00 నుండి 6.30 గంటల వరకు కృత్తిక నక్షత్రం నందు కృత్తిక దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం గర్బాలయంలో, తరువాత ఆలయ శిఖరంపైన, కొండపైన దీపారాధన చేస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.