HOLY MAGHA PURNIMA BATH AT KALESWARAM ON FEB 27 _ ఫిబ్రవరి 27న కాళేశ్వరం త్రివేణిసంగమంలో మాఘపూర్ణిమ స్నానం
Tirumala, 26 Feb. 21: As part of its Maghamasa Mahotsavam, TTD is organising the Magha Purnima Holy snanam at the Triveni Sangam of Kaleswaram in Telangana on February 27.
The SVBC channel will provide a live telecast for the event between 9am and 11am on Saturday. As part of the festivities the TTD is organising a grand Snapana tirumanjanam for utsava idols of Sri Malayappa Swamy and His consorts Sridevi and Bhudevi followed by Chakrasnanam.
Popularly known as Dakshina Kashi, Kaleswaram is the abode of Shaivism where the Pranahita and Saraswati rivers merge with the Godavari and is known as Triveni Sangamam.
TTD will conduct all programs at the famous Sri Muktheswara temple on the banks of Godavari.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఫిబ్రవరి 27న కాళేశ్వరం త్రివేణిసంగమంలో మాఘపూర్ణిమ స్నానం
తిరుమల, 2021 ఫిబ్రవరి 26: టిటిడి తలపెట్టిన మాఘమాస మహోత్సవంలో భాగంగా ఫిబ్రవరి 27న మాఘపూర్ణిమను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మాఘపూర్ణిమ పుణ్యస్నానం కార్యక్రమం జరుగనుంది. ఉదయం 9 నుండి 11 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో స్నపనతిరుమంజనం, ఆ తరువాత చక్రస్నానం నిర్వహిస్తారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత, అంతర్లీనంగా సరస్వతి నదులు ప్రవహిస్తున్నాయి. ఈ మూడు నదుల సంగమ స్థానమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వరస్వామివారి ఆలయం వద్ద ఈ కార్యక్రమం జరుగనుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.