HOME GUARDS DAY OBSERVED IN TTD_ 55వ హోంగార్డ్స్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఘనంగా టిటిడిలో రక్తదాన శిబిరం

Tirupati, 6 December 2017: In view of the 55th Home Guards Formation Day, about 150 home guards who are discharging duties in TTD donated blood in TTD Central Hospital on Wednesday.

Complimenting the services of Home Guards, TTD CVSO Sri A Ravikrishna said, the home guards are discharging impeccable duties. He also wished them on the Formation day anniversary.

Additional CVSO Sri Sivakumar Reddy, CMO Dr Nageswara Rao, Home Guards in-charge Sri Subramanyam Reddy, ADFO Sri Srihari Jagannatham and other officers were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

55వ హోంగార్డ్స్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఘనంగా టిటిడిలో రక్తదాన శిబిరం

డిసెంబరు 06, తిరుపతి, 2017: 55వ హోంగార్డ్స్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా టిటిడిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు రక్తదానం చేశారు. టిటిడి కేంద్రీయ వైద్యశాలలో బుధవారం ఉదయం 150 మంది హోంగార్డులు రక్తదానం చేశారు.

రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా సివిఎస్‌వో మాట్లాడుతూ హోంగార్డులు ఎన్నో ఒత్తిడుల మధ్య విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నారని అన్నారు. టిటిడిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు మంచి జరగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ముందుగా హోంగార్డులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌ రెడ్డి, ముఖ్య వైద్యాధికారి డా|| డి.నాగేశ్వరరావు, హోంగార్డ్స్‌ డిఎస్‌పి శ్రీ డి. లక్ష్మణ్‌ కుమార్‌, టిటిడి హోంగార్డ్స్‌ ఇంఛార్జి శ్రీ సుబ్రమణ్యం రెడ్డి, అగ్నిమాపక అధికారి శ్రీ హరిజగన్నాథ్‌, వైద్య సిబ్బంది, పలువురు హోంగార్డులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.