శ్రీ కోదండరామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

శ్రీ కోదండరామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

డిసెంబరు 06, తిరుపతి, 2017: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో బుధవారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రతినెలా కల్యాణం నిర్వహిస్తారు.

ఇందులోభాగంగా ఆలయంలోని కల్యాణమండపంలో ఉదయం 11 గంటలకు కల్యాణోత్సవ ఘట్టం ప్రారంభమైంది. అర్చకులు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న గృ హస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేశారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అక్కడి నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ చేపట్టారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీ, సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శేషారెడ్డి, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.