HOME MINISTER OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE _ శ్రీవారిని దర్శించుకున్న భార‌త‌ హోంమంత్రి గౌ|: శ్రీ అమిత్ షా, గౌ: ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి

AP CM ACCOMPANIES

 TIRUMALA, 13 NOVEMBER 2021: The Honourable Union Home Minister Sri Amit Shah who is on a three-day visit to Tirupati to Chair South Zonal Meet, offered prayers in the Tirumala temple on Saturday night.

He was accompanied by the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy for Darshan.

Earlier on his arrival at Mahadwaram -the main entrance of the temple, he was given a warm reception by TTD Chairman Sri YV Subba Reddy and Executive Officer Dr KS Jawahar Reddy.

After offering prayers to Sri Venkateswara Swamy, he was rendered Vedaseervachanam by Vedic Pundits at Ranganayakula Mandapam.

Later he was presented with Theertha Prasadams, portrait of Srivaru, Calendars and Diaries, Coffee Table Book.

MPs Dr Gurumurty, Sri CM Ramesh, Deputy CM Sri Narayana Swamy, AP Endowments Minister Sri V Srinivasa Rao, Chief Secretary Sri Sameer Sharma, DGP Sri Goutam Sawang, District Collector Sri Harinarayana, Tirupati Urban SP Sri Venkatappala Naidu, JEO Sri Veerabrahmam, TTD CVSO Sri Gopinath Jatti were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న భార‌త‌ హోంమంత్రి గౌ|: శ్రీ అమిత్ షా, గౌ: ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి

తిరుమల, 2021 న‌వంబ‌రు 13: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శ‌నివారం రాత్రి భారత హోం మంత్రి గౌ|: శ్రీ అమిత్ షా, ముఖ్యమంత్రి గౌ : శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. వీరి వెంట పలువురు రాష్ట్ర మంత్రులు ఉన్నారు.

శ్రీవారి ఆలయం మ‌హాద్వారం వ‌ద్ద గౌ|| హోం మంత్రి, ముఖ్యమంత్రి కి టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి స్వాగతం పలికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం హోం మంత్రి, ముఖ్యమంత్రి శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడ నుండి విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు చెల్లించి, భాష్యకార్లను, శ్రీ యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.

స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో హోం మంత్రి, ముఖ్యమంత్రి కి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను, కాఫీ టేబుల్ బుక్‌, 2022 డైరీ, క్యాలెండ‌ర్‌, అగ‌ర‌బ‌త్తులు హోంమంత్రి శ్రీ అమిత్ షాకుఅందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి, మంత్రి శ్రీ వెలం పల్లి శ్రీనివాసరావు, శాసనసభ్యులు శ్రీ ఆదిమూలం, ఎమ్మెల్సీ శ్రీ కళ్యాణ్ చక్రవర్తి,
ఎంపిలు డాక్టర్ గురుమూర్తి, శ్రీ సి ఎం రమేష్, తిరుపతి డిప్యూటి మేయర్ శ్రీ భూమన అభినయ్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త శ్రీ తలసిల రఘురామ్, చీఫ్ సెక్రటరీ శ్రీ సునీల్ శర్మ, డిజిపి శ్రీ గౌతమ్ సవాంగ్, జెఈవో శ్రీ వీర బ్రహ్మం సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, జిల్లా కలెక్టర్ శ్రీ హ‌రినారాయ‌ణ‌, అర్బన్ ఎస్పీ శ్రీ వెంకట అప్పల నాయుడు, డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్ బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.