HONOURING DIGNITARIES AT RANGANAYAKULA MANDAPAM IS DECADES OLD PRACTICE – TTD CHAIRMAN _ శేష వాహనం ముందు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం ఇవ్వడం అనవాయితీ – టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి

Tirumala, 27 November 2023: TTD Chairman Sri Bhumana Karunakar Reddy on Monday cleared that it has been a regular practice by TTD to present Srivari Thirtha Prasadams and laminated photo of the deity to the dignitaries after Srivari Darshan at Ranganayakula Mandapam.

 

Reacting to some social media reports he said TTD as part of its regular practice of honouring the dignitaries, has presented the Honourable Prime Minister of India, Sri Narendra Modi with Srivari Theertha Prasadams, a copy of Coffee Table Book on TTD, Panchagavya products, Agarbattis, 2024 TTD diaries and calendars along with a portrait of Sri Venkateswara Swamy on Monday morning in front of Sesha Vahanam at Ranganayakula Mandapam.

 

He said the campaign against the regular practice where in the PM was presented temple honours in front of Sesha Vahanam in the Ranganayakula Mandapam was misinformed by some vested political interests.

 

He said since decades the VIP dignitaries are being honoured in the similar manner and urged the devotees not to be carried away by such wrong campaigns.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శేష వాహనం ముందు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం ఇవ్వడం అనవాయితీ

– దీన్ని కూడా కొందరు రాజకీయం చేయడం దౌర్భాగ్యం

– టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి

తిరుమల, 2023 నవంబరు 27: శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో గల శేష వాహనం ముందు వివిఐపిలకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం ఇవ్వడం, వారిని అడిగి ఫొటోలు తీసుకోవడం జరుగుతూ ఉంది . అనంతరం వీటిని మీడియాకు, వివిఐపిలకు కూడా పంపడం ఆనవాయితీగా వస్తోందని టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీన్ని కూడా కొందరు రాజకీయం చేసి విమర్శలకు దిగడం దౌర్భాగ్యమని ఆయన చెప్పారు.

ఈ సంప్రదాయంలో భాగంగానే సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో భారత ప్రధానమంత్రివర్యులు గౌ.శ్రీ నరేంద్ర మోడీ గారికి వేదపండితులు ఆశీర్వచనం చేశారన్నారు . తానే ప్రధానమంత్రి వర్యులను ఆహ్వానించి అక్కడ వారికి స్వామివారి ప్రసాదాలతో పాటు టీటీడీ కాఫీ టేబుల్ బుక్, పంచగవ్య ఉత్పత్తులు, 2024 డైరీ, క్యాలెండర్, స్వామివారి చిత్రపటం అందించడం జరిగిందని వివరించారు. ఆశీర్వచనం తరువాత తానే గౌ.ప్రధానమంత్రివర్యులను ఆహ్వానించి ఫొటోలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.

అయితే కొంతమంది స్వామివారి శేష వాహనం ముందు ఇలా చేయడం సరి కాదని ప్రచారం చేయడం సబబు కాదని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆలయానికి వచ్చే వివిఐపీలకు రంగనాయకుల మండపంలోని శేష వాహనం ఎదుట స్వామివారి ప్రసాదాలు, చిత్రపటం తదితరాలు ఇవ్వడం, వారిని అడిగి ఫొటోలు తీసుకోవడం జరుగుతోందన్నారు . వీటినే మీడియాకు పంపడమనేది ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. స్వామి వారి దర్శనం తరువాత వివి ఐపిలు , విఐపిలు రంగనాయకుల మండపంలోని శేష వాహనం ముందే ఫోటోలు తీసుకునే ప్రదేశం. అయితే కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని కూడా వివాదాస్పదం చేయాలనుకోవడం దౌర్భాగ్యమన్నారు . దేవుడి దర్శనాన్ని కూడా రాజకీయం చేసి విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి దుర్మార్గపు ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని ఛైర్మన్ కోరారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.